గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్: వెంటనే విజయవాడ జైలుకు తరలింపు, బెయిల్‌పై కోర్టులో వాదనలు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. '

'అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..? పందికొక్కుల్లా మేసిన చంద్రబాబు, లోకేష్‌లను..’'అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..? పందికొక్కుల్లా మేసిన చంద్రబాబు, లోకేష్‌లను..’

డిశ్చార్జ్ అయిన వెంటనే జైలుకు తరలింపు..

డిశ్చార్జ్ అయిన వెంటనే జైలుకు తరలింపు..


అయితే, జీజీహెచ్ అప్పటికే ఆస్పత్రి వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. డిశ్చార్జ్ అయిన వెంటనే అంబులెన్స్‌లో అచ్చెన్నాయుడును విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అనారోగ్యంగా ఉన్న అచ్చెన్నాయుడును ఆస్పత్రిలో ఉంచకుండా జైలుకు తరలించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది జగన్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనని ధ్వజమెత్తాయి.

ఇంకా కోలుకోలేదు.. కరోనా పరీక్షలు చేయరా?: అచ్చెన్నాయుడు

ఇంకా కోలుకోలేదు.. కరోనా పరీక్షలు చేయరా?: అచ్చెన్నాయుడు

అయితే, తనకు అన్ని పరీక్షలు చేశాకే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండ్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
కొలనోస్కోపీ పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదు. కరోనా పరీక్షలు చేయకుండా జైలు అధికారులు అనుమతించరు. కాబట్టి తనకు కరోనా పరీక్షలు కూడా చేయాలి అని అచ్చెన్నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. కానీ, వైద్యులు అతని లేఖను పరిగణలోకి తీసుకోలేదు. బుధవారమే ఆయనను డిశ్చార్జ్ చేశారు. శస్త్రచికిత్స జరగడంతో అనారోగ్యం కారణంగా అచ్చెన్నాయుడు గత కొద్ది రోజులుగా జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఆస్పత్రిలోనే విచారించిన ఏసీబీ..

ఆస్పత్రిలోనే విచారించిన ఏసీబీ..


ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాంలో అచ్చాన్నాయుడు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈఐఎస్ స్కాంలో ఏ-2గా అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది. కాగా, జూన్ 25-27 వరకు మూడు రోజులపాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఆస్పత్రిలోనే ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును విచారించారు.

Recommended Video

సభలో గందరగోళం.. ఆవేశంతో తొడ కొట్టిన Minister Anil kumar Yadav!
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు..

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు..

ఇది ఇలావుండగా, అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. జులై 3న తన నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. కాగా, అచ్చెన్నాయుడు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించనున్నారు. ఈఎస్ఐ స్కాంలో జూన్ 12న అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

English summary
Atchannaidu discharged from GGH: sent to vijayawada sub jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X