• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మరో టీడీపీ నాయకుడిపై దాడి ..జగన్ కార్యకర్తలను కంట్రోల్ చెయ్యలేని అసమర్ధులా .. లోకేష్ ఫైర్

|
  ఏపీలో టిడిపి కార్యకర్తలపై కొనసాగుతున్న దాడులు || Once Again Nara Lokesh Fires On AP CM YS Jagan

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడులే కాదు , శారీరక దాడులు సైతం పెరిగిపోయాయి. గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నాయి . గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆగటం లేదు . టీడీపీ కార్యకర్తలపై దాడులపై టీడీపీ మండిపడుతున్నా అధికార పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

  చంద్రబాబుకు మరో షాక్ .. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి ఎసరు పెట్టిన వైసీపీ నేతలు

  ఏపీలో కొనసాగుతున్న దాడులు .. సీఎం జగన్ పై టీడీపీ నాయకుల ఆగ్రహం

  ఏపీలో కొనసాగుతున్న దాడులు .. సీఎం జగన్ పై టీడీపీ నాయకుల ఆగ్రహం

  ఒకపక్క చంద్రబాబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన , గాయాలపాలైన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు యాత్ర చేపట్టారు. ఒకపక్క రాష్ట్ర వ్యాప్తంగా దాడులపై ఆందోళన వ్యక్తమవుతున్నా ఇంత మంది చనిపోతున్నా ఏపీ సీఎం జగన్ మాత్రం దాడుల మీద ఇప్పటి వరకు స్పందించలేదు . పార్టీ శ్రేణులకు సంయమనం తో ఉండమని చెప్పలేదు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్లకూరు గ్రామ సర్పంచ్ అడ్డాల శివరామరాజుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు.

  ఫ్లెక్సీ ల గొడవలో టీడీపీ సర్పంచ్ పై ఇనుప రాడ్ తో దాడి .. తీవ్ర గాయాలు

  ఫ్లెక్సీ ల గొడవలో టీడీపీ సర్పంచ్ పై ఇనుప రాడ్ తో దాడి .. తీవ్ర గాయాలు

  మండలంలోని కాళ్ళకూరులో టీడీపీ , వైసీపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ రగడ నెలకొంది . ఫ్లెక్సీ తొలగింపు వివాదంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాళ్ళకూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మండల సర్పంచ్‌ల ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు అడ్డాల శివరామరాజు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కన ఉన్న స్తంభాలకు గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీ కట్టించారు. మంగళవారం ఉదయం వైసీపీ నాయకుడు గాదిరాజు గోపాలరాజు ఫ్లెక్సీని తొలగిస్తుండగా శివరామరాజు ప్రశ్నించారు. దీనితో గోపాలరాజు చేతిలో ఉన్న ఇనపరాడ్‌తో శివరామరాజు తల పై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన శివరామరాజు ప్రస్తుతం భీమవరం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  కార్యకర్తలను కంట్రోల్ చెయ్యలేని అసమర్థతతో ఉన్నారా జగన్ అని నిలదీస్తున్న నారా లోకేష్

  కార్యకర్తలను కంట్రోల్ చెయ్యలేని అసమర్థతతో ఉన్నారా జగన్ అని నిలదీస్తున్న నారా లోకేష్

  సర్పంచ్, టీడీపీ నేత అయిన శివరామరాజు మీద జరిగిన దాడి జగన్ కు కనిపించటం లేదా ? అని మాజీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ దాడులను ఖండించడానికి సీఎం జగన్ కు మనసు రావడం లేదా? అని నిలదీశారు . సీఎం జగన్ తమ కార్యకర్తలను అదుపు చేయలేని అసమర్థతతో ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్ . కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనీ, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ ను హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ లో లోకేశ్ పోస్ట్ పెట్టారు. దాడికి గురైన శివరామరాజు ఫొటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు లోకేష్ .

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Lokesh fired on Jagan about the Attack on Sarpanch and TDP leader .Asked former minister Nara Lokesh Do CM have mind to condemn these attacks? That is. or CM Jagan incapable of controlling their activists? Nara Lokesh has expressed resentment. Nara Lokesh warned AP CM Jagan that the time will not be the same.Lokesh posted this on Twitter. Shivaramaraju photos and the incident Lokesh shows to the people in Twitter account .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more