గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును ఇక‌ జ‌గ‌నే కాపాడాలా : 13మంది ఎమ్మెల్యేల‌కు బీజేపీ స్కెచ్‌: ఆ లెక్క ప‌క్కా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

13మంది ఎమ్మెల్యేల‌కు బీజేపీ స్కెచ్‌ : ఆ లెక్క ప‌క్కా..! || Oneindia Telugu

ఏపీ రాజ‌కీయంలో కొత్త ట్విస్ట్‌. టీడీపీ మీద బీజేపీ సునామీలా విరుచుకుప‌డుతోంది. న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీల‌ను లాగేసింది. ఇప్పుడు ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల మీద దృష్టి సారించింది. అందు కోసం ఆప‌రేష‌న్ ప్రారంభించింది. టీడీపీ ఎమ్మెల్యేల‌ను తాను రాజీనామా చేయ‌కుండా వ‌స్తే తీసుకోన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌గానే..టీడీపీ ఊపిరి పీల్చుకుంది. తాము గ‌తంలో 23 మంది ఎమ్మెల్యేల‌ను లాగేసిందుకు..జ‌గ‌న్ ఎప్పుడు ఏం చేస్తార‌నే టెన్ష‌న్‌కు కాస్త రిలీఫ్ దొరికింది. ఇంతలో బీజేపీ విరుచుకుప‌డింది. ఇప్పుడు ఎమ్మెల్యేలను ల‌క్ష్యంగా చేసుకుంది. ఇక‌, చంద్ర‌బాబు కు ప్ర‌తిప‌క్ష నేత హోదా మిగ‌లాల‌న్నా..టీడీపీ నిల‌దొక్కుకోవాల‌న్నా..జ‌గ‌న్ వ‌ల్లే సాధ్యం. మ‌రి..జ‌గ‌న్ ఏం చేస్తారు..

మంత్రుల‌కు జ‌గ‌న్ కొత్త బాధ్య‌త‌లు: మంత్రుల‌కు జ‌గ‌న్ కొత్త బాధ్య‌త‌లు:

ఎమ్మెల్యేల పైనా బీజేపీ ఫోక‌స్‌..

ఎమ్మెల్యేల పైనా బీజేపీ ఫోక‌స్‌..

రాజ‌కీయంగా టీడీపీ పైన బీజేపీ అధినాయ‌క‌త్వం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఏపీలో ఏ ర‌కంగా త‌మ పార్టీకి..త‌మ‌కు భారీ న‌ష్టం చేసేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారో..అదే ఏపీలో చంద్ర‌బాబుకు..ఆయ‌న పార్టీకి అదే స్థాయిలో రివేంజ్ కోసం బీజేపీ పావులు క‌దుపుతోంది. ఇందులో భాగంగా ఏపీలో గెలిచిన 11 మంది టీడీపీ ఎమ్మెల్యేల‌ను బీజేపీ ట్రాప్ చేసింద‌ని..వారితో ట‌చ్‌లో ఉందంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. టీడీపీలో ఉన్నా రాజ‌కీయంగా భ‌విష్య‌త్ లేద‌ని బీజేపీలోకి రావటం ద్వారా భ‌విష్య‌త్ తాము చూసుకుంటామంటూ హామీ ఇస్తున్న‌ట్లు స‌మాచారం.ఇందు కోసం ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఓ సీనియ‌ర్ నేత నాయ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. రాజ్య‌స‌భ ఎంపీలు న‌లుగురు వెళ్లిపోవ‌టం..కాపు సామాజిక వ‌ర్గ‌నికి చెందిన నేత‌లు అసంతృప్తితో ఉండ‌టంతో..బీజేపీ ఆహ్వానించిన స‌మ‌యంలో వెళ్తేనే గౌర‌వం ద‌క్కుతుంద‌నే భావ‌న‌లో ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

జ‌గ‌న్ మాత్ర‌మే కాపాడ‌గ‌ల‌రు..

జ‌గ‌న్ మాత్ర‌మే కాపాడ‌గ‌ల‌రు..

ఎంపీల విష‌యంలో చేతులెత్తేసిన టీడీపీ అధినాయ‌క‌త్వం ఎమ్మెల్యే విష‌యంలో టెన్ష‌న్ ప‌డుతోంది. జ‌గ‌న్ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌కుండా వ‌స్తే తాము ఆహ్వానించ‌మ‌ని శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. తాము గ‌తంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తీసుకోవ‌టంతో..ఇప్పుడు జ‌గ‌న్ సైతం త‌మ‌కు ఉన్న ఎమ్మెల్యేల‌ను లాగేస్తార‌నే టీడీపీ నేత‌ల టెన్ష‌న్‌కు కొంత రిలీఫ్ ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ నిజంగా ఎమ్మెల్యేల‌ను ట్రాప్ చేసి.. మొత్తం 23 మందిలో 13 మంది ఎమ్మెల్యేల ద్వారా రాజ్య‌స‌భ‌లో వ్య‌వ‌హ‌రించిన తీరుగానే ఇక్క‌డా అమ‌లు చేసే ఛాన్స్ లేక‌పోలేదు. అక్క‌డ మెజార్టీ స‌భ్యుల నిర్ణ‌యం అంటూ టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీని ఏకంగా బీజేపీలో విలీనం చేసారు. ఇక‌, ఇక్క‌డ కూడా 23 మందిలో 13 మంది ఆమోదంతో టీడీపీ లెజిస్లేచ‌ర్ పార్టీని బీజేపీ పార్టీగా గుర్తించ‌మ‌ని కోరాల‌ని బీజేపీ నేత‌ల ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అయితే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండ‌టంతో అక్క‌డ వ్య‌వ‌హారం సులువు అయింది. కానీ, ఇక్క‌డ జ‌గ‌న్ అధికారంలో ఉన్నారు. ఆయ‌న బీజేపీతో స‌న్నిహితంగా ఉంటున్నా.. ఇదే జ‌రిగితే ఆయ‌న అంత సులువుగా విలీనం నిర్ణ‌యానికి ఒప్పుకోర‌నేది టీడీపీ నేత‌ల ఆశ‌..అంచ‌న

జ‌గ‌న్ అంగీక‌రిస్తారా..ఆమోదిస్తారా..

జ‌గ‌న్ అంగీక‌రిస్తారా..ఆమోదిస్తారా..

ఇప్ప‌టికే బీజేపీలో చేరిన రాజ్య‌స‌భ స‌భ్యుల ద్వారా ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ స‌మ‌యంలో..ఫిరాయింపుల మీద స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో ఉన్న జ‌గ‌న్ టీడీపీ ఎమ్మెల్యే విష‌యంలో తాను ఎక్క‌డా డామేజ్ కాకుండా ముందుగానే స‌భా వేదిక‌గా త‌న విధానం స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యంలో బీజేపీ ఎత్తుగ‌డ‌లు ముందుగానే తెలిసి..ఎవ‌రైనా పార్టీ ఫిరాయిస్తే వారి పైన అన‌ర్హ‌త వేటు వేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌లో ఉండ‌గానే..స‌భాప‌తిని జ‌గ‌న్ కోరారు. ఇక‌, ఇప్పుడు విలీనానికి అవ‌కాశం లేక‌పోయినా.. కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ లోకి వెళ్తే వారి పైన జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు స్పీక‌ర్ ఖ‌చ్చితంగా అన‌ర్హ‌త వేటు వేస్తార‌నే ధీమాలో టీడీపీ నేత‌లు ఉన్నారు. ఇదే విష‌యాన్ని పార్టీలో చ‌ర్చించి..ఎమ్మెల్యేల‌కు పార్టీ మారితే జ‌రిగే న‌ష్టాన్ని వివ‌రిస్తున్నారు. ఏ ర‌కంగా చూసినా..ఇప్పుడు ఎమ్మెల్యేలు జారిపోకుండా..చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత హోదాలో కొన‌సాగాలంటే..జ‌గ‌న్ మాత్ర‌మే కాపాడ‌గ‌ల‌ర‌ని టీడీపీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ బీజేపీకి స‌హ‌క‌రిస్తారా..లేక వ్య‌తిరేకిస్తారా అనేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

English summary
BJP concentrated on TDP MLA's in AP. Some leaders giving feelers that already some TDP MLas touch with BJP to jump in that party. If MLA's jump into BJP then Speaker decision become crucial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X