గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటి రాంబాబు పేరుతో అర్ధరాత్రి బెదిరింపులు... పోలీసులకు ఫిర్యాదు...

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరుతో తనను కొంతమంది బెదిరింపులకు గురిచేస్తున్నారని పెరుమాళ్ల హనుమాన్‌ ప్రసాద్ అనే ఓ వ్యాపారి ఆరోపించారు. అర్ధరాత్రి ఫోన్‌ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. నీ సంగతి తేలుస్తామని... ముక్కలుగా నరుకుతామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం(సెప్టెంబర్ 24) గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రెస్ మీట్ పెట్టిన హనుమాన్ ప్రసాద్ ఆ వివరాలు వెల్లడించారు.

కొవిడ్-19 నుంచి కోలుకున్న అంబటి రాంబాబు - మరో వారంపాటు హోం క్వారంటైన్ లోనే ..కొవిడ్-19 నుంచి కోలుకున్న అంబటి రాంబాబు - మరో వారంపాటు హోం క్వారంటైన్ లోనే ..

నరసరావుపేట రోడ్డులోని సర్వే నంబర్ 174లో తనకు 11 సెంట్ల స్థలం ఉందన్నారు హనుమాన్ ప్రసాద్. అయితే కొంతమంది దాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. అప్పటినుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని... పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించారని చెప్పారు. ఈ వ్యవహారంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ... ఆయన పేరుతో తనను బెదిరించినట్లు చెప్పారు.

case file against a man who is threatening in the name of mla ambati rambabbu

Recommended Video

AP CM YS Jagan ఇంటి ముందు భజరంగ్ దల్ నిరసన, అరెస్ట్

బెదిరింపులపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని... ఆడియో రికార్డులు కూడా పోలీసులకు అందించానని తెలిపారు. వ్యాపారి హనుమాన్ ప్రసాద్ ఫిర్యాదు పోలీసులు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు.

English summary
Hanuman Prasad,a local merchant in Sattenapalli town was given a complaint to police against Srinivas Reddy,who is threatening him in the name of YSRCP MLA Ambati Rambabu in a land issue. He said Srinivas Reddy threatening him over phone call in the mid night
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X