• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

యరపతినేని టార్గెట్ గా వేగం పెంచిన సీబీఐ .. మైనింగ్ అక్రమాల కేసుతో టెన్షన్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే

|

ఏపీలో టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది .ఒకరి తర్వాత ఒకరు అవినీతి , అక్రమాల ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్నారు . ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ నేతల అక్రమాలపై పెద్ద ఎత్తున దర్యాప్తు సాగుతుంది . గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణకు గతంలోనే హైకోర్టు అనుమతించింది. దీంతో ప్రభుత్వం యరపతినేని అక్రమ మైనింగ్ కేసును సీబీఐ కి అప్పగించింది. అప్పటి నుండి యరపతినేనికి ఎక్కడలేని కష్టాలు వచ్చి పడ్డాయి. సహజంగా తన గొంతును గట్టిగా వినిపించే యరపతినేని తాజా పరిణామాల నేపధ్యంలో సైలెంట్ గా ఉంటున్నారు .

మీరు హోం మంత్రిగా ఫెయిల్ అయ్యారు .. సుచరితకు వర్ల రామయ్య బహిరంగలేఖ

 సిఐడీ నుండి సీబీఐకి మైనింగ్ అక్రమాల కేసులో కీలక డాక్యుమెంట్స్

సిఐడీ నుండి సీబీఐకి మైనింగ్ అక్రమాల కేసులో కీలక డాక్యుమెంట్స్

యరపతినేని అక్రమ మైనింగ్ కేసులో అక్రమ మైనింగ్ జరిగిందని సీఐడీ ఇచ్చిన నివేదిక ద్వారా గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆ కేసును సీబీఐ విచారణకు గత ఏడాది డిసెంబర్ 24న అప్పగించింది.అప్పటి నుండి ఈ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ ను సిఐడీ నుండి సీబీఐ తీసుకున్నట్టు సమాచారం . దీంతో మైనింగ్ అక్రమాల కేసులో సీబీఐ స్పీడ్ పెంచుతుంది అని తెలుస్తుంది .

కేసులతో ఇబ్బంది పడుతున్న టీడీపీ నేతలు

కేసులతో ఇబ్బంది పడుతున్న టీడీపీ నేతలు

ఇప్పటికే టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పలు కేసుల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. మాజీ మంత్రిఅచ్చెన్నాయుడు ఈ ఎస్ఐ స్కాం లో చిక్కి ఇబ్బంది పడుతున్నారు. పితాని సత్యన్నారాయణ కూడా అదే బాటలో ఉన్నాడు . ఇక వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు .ఇక జేసీ బ్రదర్స్ దివాకర్ ట్రావెల్స్ విషయంలో ఫోర్జరీ , నకిలీ పత్రాలు సృష్టించి పలు అక్రమాలు చేసినట్టు కేసులతో జైళ్ళ చుట్టూ , కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే సమయంలో యనమల, అయ్యన్నపాత్రుడు ఇలా టీడీపీ ముఖ్యనేతలంతా పలు కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ సమయంలో మరోసారి యరపతినేని శ్రీనివాస్ పై అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ దూకుడు పెంచటం టీడీపీ శ్రేణులకు కాస్త టెన్షన్ పుట్టిస్తుంది .

అక్రమ మైనింగ్ కేసులో పూర్తి దర్యాప్తు .. వదిలిపెట్టేది లేదన్న సర్కార్

అక్రమ మైనింగ్ కేసులో పూర్తి దర్యాప్తు .. వదిలిపెట్టేది లేదన్న సర్కార్

గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , టీడీపీలో కీలక నేత యరపతినేని అక్రమంగా మైనింగ్ నిర్వహించాడని ఆయనపై గతంలో కేసు నమోదైంది. అక్రమంగా మైనింగ్ చేశాడని సీఐడీ నివేదిక ఆధారంగా తేలిందని అప్పట్లో హై కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అక్రమ మైనింగ్ లో వెనకున్న సూత్రధారుల కోసం కూడా విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఈ కేసును సమగ్రంగా విచారించటానికి ఏపీ ప్రభుత్వం సీబీఐకి కేసు అప్పగించింది . ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అక్రమాలు చేసిన గత పాలకులను విడిచిపెట్టేది లేదని జగన్ సర్కార్ తేల్చి చెప్తుంది .

 మైనింగ్ అక్రమాలు జరిగాయన్న సిఐడీ .. 16 మందిపై కేసు నమోదు

మైనింగ్ అక్రమాలు జరిగాయన్న సిఐడీ .. 16 మందిపై కేసు నమోదు

యరపతినేని గతంలో గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఆయనపై మాజీ ఎమ్మెల్యే టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ఆయనపై ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఇక దానిపై విచారణ జరిపిన కోర్టు ఒత్తిడితో గత ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిఐడీ విచారణకు ఆదేశించి చేతులు దులుపుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్‌ జరిగినట్లు సిఐడీ అధికారులు నిర్ధారించారు. దీంతో యరపతినేనితోపాటు 16 మందిపై 18 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో సిబీఐ వేగం పెంచింది .

English summary
The AP government had on December 24 last year handed over the case to the CBI, which had identified the illegal mining in the Yarpathineni srinivas illegal mining case, as per the CID report. The latest information is that the CBI has taken key documents related to the case from the CID. This shows that the CBI will increase the speed in the case of mining irregularities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X