గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మ‌నం త‌ప్పు చేయలేదు: 40శాతం ఓట్లను వేసిన ప్రజల కోసం పని చేయాలి: చ‌ంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధిన‌తే చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత చంద్ర‌బాబు పార్టీ రాష్ట్ర కార్యాల యానికి తొలి సారి వ‌చ్చారు. ఇక నుండి వారానికి అయిదు రోజులు ఏపీ పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలోనే ఉండాల‌ని నిర్ణ‌యించారు. లోకేశ్ సైతం ఇదే కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉంటారు. చంద్ర‌బాబు త‌న పాల‌న‌లో ఎక్క‌డా త‌ప్పు చేయ‌లేద‌ని మరో సారి చెప్పుకొచ్చారు. అదే విధంగా టీడీపీకి ఎన్నిక‌ల్లో ఓటు వేసిన 40 శాతం మంది ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌ని చెప్ప‌టం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది.

40శాతం ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాలి..
మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేసారు. పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆయ‌న త‌న పాల‌న గురించి వివ‌రించారు. తెలుగుదేశం పార్టీకి చ‌రిత్రాత్మ‌క‌త ఉంద‌న్నారు. పార్టీ పైన బాధ్య‌త పెరిగింద‌ని చెబుతూనే.. ఎన్నిక‌ల్లో 40 శాతం ఓట్లు వేసిన ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌ని వ్యాఖ్యానించారు. దీంతో..పార్టీ నేత‌ల‌తో పాటుగా అక్క‌డ ఉన్న కార్య‌క‌ర్త‌లు సైతం ఆశ్చ‌ర్య పోయారు. టీడీపీకి తాజా ఎన్నిక‌ల్లో 40 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇప్పుడు పార్టీ అధినేత సైతం వారి కోస‌మే ప‌ని చేయాల‌ని చెప్ప‌టం ద్వారా వ్య‌తిరేక సంకేతాలు వెళ్తాయనే ఆందోళ‌న అక్క‌డికక్క‌డే కొంద‌రే నేత‌లు వ్య‌క్తం చేసారు. అంటే మిగిలిన ప్ర‌జ‌ల గురించి టీడీపీ ఇక ఆలోచించ‌దా అనే చ‌ర్చ సైతం తెర మీదకు వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో త‌న హయాంలో ఎటువంటి త‌ప్పు చేయ‌లేద‌ని..అరాచ‌కాలు చేయ‌లేద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. టీడీపీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని..అటువంటి కార్య‌క‌ర్త‌లు ఉన్నంత వ‌ర‌కూ పార్టీకి న‌ష్టం లేద‌ని చెప్పారు. వైవైసీపీ పాల‌న గురించి ప్ర‌స్తావించారు.

Chadnra babu decided to stay in party state office for five days in a week. Babu assured partly followers

ఇక పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలోనే..
ఇక నుండి గుంటూరు నుంచే రాష్ట్ర కార్యకలాపాలు జరుగుతాయని. కొత్త కార్యాలయం సిద్ధమయ్యేవరకు ఎక్కడ్నుంచో పని చేసేకన్నా గుంటూరే సులభమని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. త‌న హ‌యాంలో 33 వేల ఎక‌రాలు భూమిని త‌న మీద న‌మ్మ‌కంతో రైతులు ఇచ్చార‌ని గుర్తు చేసారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను కోల్పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. 37 ఏళ్ళ పాటు పార్టీని, జెండాని మోసింది కార్యకర్తలే. పార్టీ వలన నష్టం వచ్చిన కార్యకర్తలు పార్టీతో ఉన్నారన్నారు. పార్టీకి మూలస్తంభాలు కార్యకర్తలే ప్రజలు, పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. మన కార్యకర్తలు ఇప్పటి వరకూ ఆరుగురు చనిపోయారు. ప్రతి కార్యకర్తని కాపాడుకుంటాం...తాను ఇక్కడే ఉంటాను అంటూ చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చారు. ఇక నుండి గుంటూరు కార్యాల‌యంలో అయిదు రోజులు.. హైద‌రాబాద్ ఆఫీసు లో రెండు రోజులు ఉండాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

English summary
TDP chief Chadnra babu decided to stay in party state office for five days in a week. Babu assured partly followers he will take care of every one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X