గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విగ్రహాలకు ఎవరు అనుమతించారు: నేరస్తుడు సీఎం అయితే ఇలాగే: చంద్రబాబు ఫైర్..!

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పైన ఆరోణలు గుప్పిస్తున్నారు. కోడెల మరణానికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ గతంలో చేసిన విమర్శలను మరోసారి ప్రస్తావించారు. కోడెల విగ్రహం ఏర్పాటుకు అనుమతించకపోవటం పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరు అనుమతులు ఇచ్చారని వైఎస్ విగ్రహాలు పెట్టారని ప్రశ్నించారు. నేరస్తుడు సీఎం అయితే ఏం చేస్తున్నాడో చూస్తున్నామని.. నేరస్తుడికి మద్దతిస్తే ఇబ్బందుల్లో పడతారని అధికారులను పరోక్షంగా హెచ్చరించారు. పరిటాలను చంపినవారు ఎక్కడ ఉన్నారో అందరికి తెలుసని.. కోడెల మృతికి కారణమైన వారికీ అదే గతి పడుతుందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

బిల్లులు చెల్లించకుండా వైసీపీలో చేర్చుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు కోడెల సంస్మరణ సభలో పొల్గొని ఆయనకు నివాళి అర్పించారు. కోడెల విగ్రహాలకు కూడా అనుమతి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు అనుమతులు ఇచ్చారని వైఎస్ విగ్రహాలు పెట్టారని ప్రశ్నించారు. అనుమతుల్లేని విగ్రహాలు తీసేయ్యాలని.. సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోలేదన్నారు. కోడెలను మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై దాడి చేస్తున్నారని వైసీపీ నేతలపైన ఫైర్ అయ్యారు. జగన్‌లా తాము దోపిడీ చేయలేదని.. చట్టపరంగా పనులు చేశామన్నారు. ఉంటానన్నారు. కోడెల కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. నేరస్తుడు సీఎం అయితే ఏం చేస్తున్నాడో చూస్తున్నామని.. నేరస్తుడికి మద్దతిస్తే ఇబ్బందుల్లో పడతారని అధికారులను పరోక్షంగా హెచ్చరించారు. కోడెల మెమోరియల్‌ను ఏర్పాటు చేస్తామని, ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకెళ్లాలన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశానని.. కార్యకర్తలను కాపాడుకుంటా, ప్రజలకు అండగా ఉంటానరి చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Chandra babu serious comments on CM Jagan. Babu says Govt harassment only the reason for Kodela suicide.

పరిటాలను చంపిన వారు ఎక్కడ ఉన్నారో..అదే
కోడెల సంస్మరణలో పాల్గొన్న టీడీపీ నేతలు వరుసగా వైసీపీ మీద ఫైర్ అయ్యారు. పరిటాలను చంపినవారు ఎక్కడ ఉన్నారో అందరికి తెలుసని.. కోడెల మృతికి కారణమైన వారికీ అదే గతి పడుతుందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు కళ్ళు నెత్తికెక్కాయని మాజీ ఎమ్మెల్యే యరపతినేని మండిపడ్డారు. కోడెల కుమారుడు తన తండ్రి మరణం తరువాత అభిమానులు తనకు అండగా నిలిచారన్నారు. చంద్రబాబు తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని ఉద్వేగానికి లోనయ్యారు. మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి పల్నాడు ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా పోరాడి.. బాంబులు పడిన చలించని కోడెల ఇలా మరణించటం బాధాకరమన్నారు.

English summary
Tdp cheif Chandra babu serious comments on CM Jagan. Babu says Govt harassment only the reason for Kodela suicice. He assure kodela Family for feautre support from party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X