గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు స్పందిస్తే.. కోడెల చనిపోయోవాడు కాదేమో : అంబటి రాంబాబు

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు మొదటిసారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు చంద్రబాబు స్పందించి ఉంటే, ఆయన ఆత్మహత్య చేసుకునేవాడు కాదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల మృతిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లభ్ది పోందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి మరోసారి ఫైర్ అయ్యారు. కోడెల గత నెల 23 నే మొదటి సారి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని టీడీపీ నేతలు, ఆయన కుటుంభ సభ్యులు చెబుతున్నారని అన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు, అప్పుడే చంద్రబాబు ఆయనతో మాట్లాడి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది ఉండేది కాదని అన్నారు.

 కోడెల కేసులపై నిర్లక్ష్యం వహించిన బాబు

కోడెల కేసులపై నిర్లక్ష్యం వహించిన బాబు

మరోవైపు కోడెలపై నమోదైన కేసులపై మాట్లాడిన చంద్రబాబు చట్టం తన పని తాను చేసుకుంటుందని నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు. ఇవన్ని పక్కన పెట్టిన చంద్రబాబు ఆయన మరణం తర్వాత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కోడేల మరణంపై ప్రభుత్వాన్ని దూషించాడమే లక్ష్యంగా చంద్రబాబు చేసుకున్నాడని ఆయన విమర్శించారు. ఇందులో భాగంగానే గవర్నర్ కలిసి ఫిర్యాదు చేశాడని అన్నారు.

పాతకాలపు ఫర్నిచర్ కోట్లలో ఉంటుంది..

పాతకాలపు ఫర్నిచర్ కోట్లలో ఉంటుంది..

మరోవైపు లక్ష రుపాయల అసెంబ్లీ ఫర్నీచర్ కోసం ఇంత రాద్దాంతం చేస్తారా అని చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణం అన్నారు. లక్ష రుపాయాల ఫర్నిచర్ అంటూ చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని ఇయన విమర్శించారు. కోడెల శివప్రసాద్ తీసుకువెళ్లిన ఫర్నిచర్ విలువ కోట్ల రుపాయాల్లో ఉంటుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న అతిపురాతనమైన ఫర్నిచర్ ను ఆయన తీసుకెళ్లారని తెలిపారు. అతిపురతనమైన అసెంబ్లీ ఫర్నిచర్ కోట్ల రుపాయల విలువ చేస్తుందని తెలిపారు. అలాంటీ పాతకాలపు ఫర్నిచర్‌ను కోడెల ఎలాంటీ అనుమతి లేకుండా తన కుమారుడి షోరూంలో పెట్టుకున్నారని అన్నారు.

గ్రామ సచివాలయ ఫలితాలపై తప్పుడు ప్రచారం

గ్రామ సచివాలయ ఫలితాలపై తప్పుడు ప్రచారం

ఇటివల ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేసిన సచివాలయ ఉద్యోగుల జాబితాలో కూడ అక్రమాలు జరిగాయని చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ యువకులను గందోరగోళంలోకి నెట్టివేస్తున్నాడని అన్నారు. చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా పరీక్ష జరిగిన కొద్ది గంటల్లోనే కీ ,కూడ విడుదల చేశామని చెప్పిన ఆయన పేపర్ లీక్ అయినప్పుడే ఎందుకు పత్రికల్లో రాలేదని ప్రశ్నించారు. పరీక్ష అంతా అయిపోయి, ఫలితాలు వెలువడ్డ తర్వాత లీకులు జరిగాయాని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రచారాన్ని యువకులు నమ్మవద్దని అంబటి సూచించారు.

English summary
MLA Ambati Rambabu has fired again after Chandrababu's false campaign on the death of former AP speaker Kodela shivaprasada rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X