గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ పద‌వులు పందేరం: నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీకి నిర్ణ‌యం: ముహూర్తం ఖ‌రారు...!

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ప‌ద‌వుల పందేరం ప్రారంభిస్తోంది. గ‌త ప్ర‌భుత్వంలో నామినేట్ అయి ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు. తొలి కేబినెట్‌లోనే ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈనెల 12 నుండి ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ స‌మావేశాల్లో దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ను ఆమోదించ‌నున్నారు. దీని ద్వారా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు. ఇందులో పూర్తిగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి గుర్తింపు ఇవ్వాల‌ని సీఎం స్ప‌ష్టం చేసారు.

మంత్రుల‌కు జ‌గ‌న్‌ హెచ్చ‌రిక‌లు: ప‌ద‌వులు ర‌ద్దు: 27 శాతం ఐఆర్‌.. సీపీఎస్ ర‌ద్దు..ఆర్టీసి విలీనానికి మంత్రుల‌కు జ‌గ‌న్‌ హెచ్చ‌రిక‌లు: ప‌ద‌వులు ర‌ద్దు: 27 శాతం ఐఆర్‌.. సీపీఎస్ ర‌ద్దు..ఆర్టీసి విలీనానికి

ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వులు..
ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ ప్ర‌క్రియను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రారంభించారు. ఇప్ప‌టికే తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అధారిటీ చైర్మ‌న్‌గా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డికి కేటాయించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. అదే విధంగా..ఏపీ ప్ర‌భుత్వ ప‌రిధిలోని అన్ని నామినేట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాలని..దీని కోసం గ‌త ప్ర‌భుత్వంలో నియ‌మించి..ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న పాల‌క మండ‌ళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మొద‌లు వ్య‌వసాయ మార్కెట్ క‌మిటీలు..వివిధ సంస్థ‌ల ఛైర్మ‌న్లు - డైరెక్ట‌ర్ల నియామ‌కాల‌ను ర‌ద్దు చేయ‌నున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో జిల్లా మంత్రులు..స్థానిక ఎమ్మెల్యేల నుండి పేర్లు సేక‌రించి..ముఖ్య‌మంత్రికి స‌మ‌ర్పించ‌నున్నారు.

Cm Jagan decided to start issue nominated posts for Party followers since YCP Formation

ఇప్ప‌టికే ప‌ద‌వుల పందేరం ఆరంభం..
ఇప్ప‌టికే వైసీపీ ప్ర‌భుత్వంలో ప‌ద‌వుల పందేరం మొద‌లు పెట్టింది. దీనికి పూర్తి స్థాయిలో కొన‌సాగించ‌టానికి అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలోనే కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌నే తొలి నుండి న‌మ్ముకొని ఉండి.. మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌ని వారు ఆవేద‌న‌తో ఉన్నారు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో కీల‌క‌మైన వాటిని అటువంటి వారికి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, పార్టీ అధికారంలోకి రావ‌టానికి కష్ట‌ప‌డిన వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు. అదే విధంగా..నామినేటెడ్ జిల్లా ప‌ద‌వులు మొత్తంగా ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే డిసైడ్ అయ్యారు. అదే విధంగా ఆల‌య పాల‌క మండ‌ళ్లు సైతం ఎమ్మెల్యే మాట మేర‌కే ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కంలోనూ 50 శాతం వ‌రకు ఖ‌చ్చితంగా బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీల‌కు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ అసెంబ్లీ స‌మావేశాల ముగింపు ద్వారా నామినేటెడ్ ప‌ద‌వుల

English summary
AP Cm Jagan decided to start issue nominated posts for Party followers since YCP Formation. After completion of coming assembly sessions fill up of nomination posts will be start.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X