గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ మార్క్ హెచ్చ‌రిక‌:అవినీతి చేస్తే మంత్రిగా అదే లాస్ట్ డే:అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు.

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మంత్రుల‌కు తీవ్ర స్థాయిలో హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. మంత్రి ప‌ద‌వులు వ‌చ్చాయి క‌దా అని ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తే స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు. ఏ మంత్రి అయినా..సంబంధీకులు అయినా..సంబంధిత శాఖ‌లో అవీన‌తి జ‌రిగితే అదే మంత్రిగా చివ‌రి రోజు అంటూ హెచ్చ‌రించారు. ఇక‌, త‌న మార్క్ నిర్ణ‌యాల‌కు సీఎం జ‌గ‌న్ ఆమోద ముద్ర వేసారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు మంజారు చేసారు. అన్ని ప్ర‌యివేటు విద్యా సంస్థ‌ల్లో 25 శాతం ఉచిత విద్య అందించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు.

జ‌గ‌న్ పద‌వులు పందేరం: నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీకి నిర్ణ‌యం: ముహూర్తం ఖ‌రారు...! జ‌గ‌న్ పద‌వులు పందేరం: నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీకి నిర్ణ‌యం: ముహూర్తం ఖ‌రారు...!

మంత్రుల‌కు జ‌గ‌న్ మార్క్ హెచ్చ‌రిక‌..

మంత్రుల‌కు జ‌గ‌న్ మార్క్ హెచ్చ‌రిక‌..

మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసి మూడు రోజులు పూర్తి కాక‌ముందే ముఖ్య‌మంత్రి త‌న మార్క్ ఏంటో చూపించారు.
తొలి కేబినెట్ స‌మావేశంలోనే మంత్రుల‌కు త‌న ల‌క్ష్యం ఏంటో స్ప‌ష్టం చేసారు. మంత్రులెవ‌రూ అవినీతికి పాల్ప‌డినా.. వారే స్వ‌యంగా కాదు..వారి పేషీ సిబ్బంది..స‌న్నిహితులు..బంధువులు..శాఖ‌లో ఎవ‌రైనా అవినీతికి పాల్ప‌డితే దీనికి మంత్రులే బాధ్య‌త వ‌హించాల‌ని తేల్చి చెప్పారు. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని వెలికి తీయాల‌ని ఆదేశించారు. ఎవ‌రైతే అవినీతిని వెలికి తీస్తారో వారికి రివార్డులు..అవార్డులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. మంత్రులు రెండున్నారేళ్లు అధికారంలో ఉంటామ‌నే ధీమాతో ఉంటే..ఖ‌చ్చితంగా ఇబ్బంది ప‌డుతార‌ని..ఏ రోజు అయినా ప‌ద‌వి కోల్పోయే అవ‌కా శం ఉంటుంద‌నే విష‌యం మ‌ర్చి పోకుండా జాగ్ర‌త్త‌గా వ‌చ్చిన అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రులకు సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పారు. తొలి గంట మంత్రులు రిజ‌ర్వ్‌గా ఉంటే..ఏంటీ మౌనం ఫ్రీగా ఉండండ‌ని సూచించారు.

అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు..

అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు..

ఏపీలో ఎంతో కాలంగా ఆవేద‌న‌తో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల‌కు ఊర‌ట ఇచ్చేలా తొలి కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకు న్నారు. అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారం హైకోర్టులో ఉండ‌టంతో కోర్టు ద్వారానే బాధితుల కోసం 1150 కోట్ల రూపాయాలు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. దీని ద్వారా 20 వేల వ‌ర‌కు డిపాజిట్లు చేసిన బాధితులు సుమారు తొమ్మ‌ది ల‌క్ష‌ల మందికి ల‌బ్ది చేకూరుతుంద‌ని అంచ‌నా వేసారు. హైకోర్టులో ప్ర‌భుత్వం త‌ర‌పున పిటీష‌న్ వేసి అగ్రిగోల్డ్ ఆస్తుల‌ను ఆక్షన్ వేయటానికి అనుమ‌తి తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. దీని ద్వారా వ‌చ్చే సొమ్మును పూర్తిగా బాధితుల‌కు చెల్లించాల‌ని తీర్మానించారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలి ఉప‌శ‌మ‌నం నిర్ణ‌యంగా ఈ మొత్తాన్ని బాధితుల‌కు చెల్లించాల‌ని డిసైడ్ అయ్యారు.

కేంద్ర సాయం గురించి ప్ర‌స్తావ‌న లేదా..

కేంద్ర సాయం గురించి ప్ర‌స్తావ‌న లేదా..

ఏపీలో ఆర్దిక క‌ష్టాలు అని చెబుతూనే..మ‌రో వైపు జ‌గ‌న్ త‌న హామీలు నెర‌వేర్చేందుకు చాలా వేగంగా క‌దులుతున్నారు. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా వాటిని అమ‌లు చేయాల‌నే ముందుకు వెళ్తున్నారు. మ‌రి..కేంద్రం అద‌న‌పు సాయం చేయ‌కుండా వీటిని అమ‌లు చేయాలంటే జ‌గ‌న్ కు క‌త్తి మీద సాముగానే మార‌నుంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల మీద అద‌న‌పు భారం వేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. తొలి కేబినెట్ స‌మావేశంలో ఎక్క‌డా రాష్ట్రంలో ఆర్దిక ప‌రిస్థితి గురించి.. కేంద్రం సాయం ..ప్ర‌ధాని ఏం చెబుతుందీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మంత్రుల‌కు వివ‌రించిన‌ట్లు స‌మాచారం లేదు. అయితే, జ‌గ‌న్ తొలి ప‌ది రోజుల్లోనే తీసుకుంటున్న ఈ నిర్ణ‌యాలు పార్టీకి మేలు చేసినా..రానున్న రోజుల్లో రాష్ట్ర అర్దిక ప‌రిస్థితి పైన ఎటువంటి ప్ర‌భావం చూపుతాయ‌నే ఆందోళ‌న మ‌రో వైపు క‌నిపిస్తోంది.

English summary
AP Cm jagan warned Ministers to away from corruption at any cost. If any one involved in corruption charges that will be the final as minister. AP Cabinet decided to allot rs 1150 cr for Agri gold victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X