గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ‌స్తీమే స‌వాల్: టిడిపి ఎమ్మెల్యే వర్సెస్ టిఆర్‌య‌స్ ఎమ్మెల్యే: ఓడిపోతే ఇక రాజ‌కీయాలు మాట్లాడ‌ను..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎన్నిక‌ల నాటి నుండి టిడిపి -టిఆర్‌య‌స్ మ‌ధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల సీనియ‌ర్ ఎమ్మెల్యేల మ‌ధ్య స‌వాల్ మొద‌లైంది. టిడిపి కి చెందిన తెనాలి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. గ‌తం లో టిడిపి లో ఉండి.. టిఆర్‌య‌స్ లోకి వెళ్లి మంత్రి అయిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే త‌ల‌సాని మ‌ధ్య కొద్ది ఈ వార్ సాగుతోంది. ఇద్ద‌రి మ‌ధ్య స‌వాళ్లు - ప్ర‌తి స‌వాళ్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

25న టిడిపిలో రాధా : జ‌న‌సేన లో చేరాల‌న్న అభిమానులు 25న టిడిపిలో రాధా : జ‌న‌సేన లో చేరాల‌న్న అభిమానులు

త‌ల‌సాని వ‌ర్సెస్ ఆల‌పాటి..

త‌ల‌సాని వ‌ర్సెస్ ఆల‌పాటి..

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి అభ్య‌ర్ధి గెలుపు కోసం కృషి చేసారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ పై త‌ల‌సాని ఈ మ‌ధ్య కాలంలో బ‌య‌ట పెట్టారు.

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌

ఆల‌పాటి తెనాలి వెళ్లి లాండ్ లైన్ నుండి త‌న‌కు ఫోన్ చేసి తెనాలి వ‌చ్చేసాన‌ని చెప్పార‌ని త‌ల‌సాని తన అనుచ‌రుల తో చెబుతున్న‌ట్లుగా ఓ వీడియా స‌ర్క్యులేట్ అవుతోంది. దీని పై తెనాలి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ స్పందిం చారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో నేనేదో భయపడి తలసానికి ఫోన్‌ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నా రని... 24 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చిన తాను.. ఇలాంటివి ఎన్నో చూశానని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై మండిపడ్డారు.

తెనాలి వ‌చ్చి ప్ర‌చారం చేసుకోవ‌చ్చు..

తెనాలి వ‌చ్చి ప్ర‌చారం చేసుకోవ‌చ్చు..

తెనాలి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌న‌కు ఫోన్ చేసార‌ని త‌ల‌సాని చెప్ప‌టాన్ని ఆల‌పాటి ఖండించారు. ఎవ‌రు ఎవ‌ర‌కి ఫోన్ చేసారని ప్ర‌శ్నిస్తూనే.. నువ్వు నాకు ఫోన్‌ చేశావా... నేను నీకు ఫోన్‌ చేశానా.. నిరుపిస్తావా అని తలసానికి సవాలు విసిరారు. ఎన్నిక‌ల్లో గెలిచినంత మాత్రాన గెలుపు త‌ల‌కెక్క‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లి తమకు నచ్చిన వారికి ప్రచారం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఉంది... పార్టీ గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తానన్నారు. తలసాని సైతం తెనాలి వచ్చి ప్రచారం చేసుకోవచ్చన్నారు. అయితే రాజకీయాల్లో భాష ప్రధానమన్నారు. ఎవరొచ్చినా స్వాగతిస్తామని తాను కనుక తెనాలిలో ఓడిపోతే ఇక రాజకీయాల గురించి మాట్లాడనని ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్ప‌ష్టం చేసారు. ఇప్పుడు ఆల‌పాటి స్పంద‌న మీద త‌ల‌సాని ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి.

English summary
AP politics are on a boil with just three months to go for elections. Tenali MLA Alapati Rajendra Prasad challenged the Telangana MLA Talasani Yadav to contest against him and if he looses the elections Alapati clarified that he would quit politics. These comments came soon after Talasani spoke about AP politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X