గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జే ట్యాక్స్ టార్గెట్ 25 వేల కోట్లు: కరోనా వ్యాప్తి నిలయాలుగా వైన్ షాపులు: నారా లోకేశ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా రికార్డవుతున్నాయి. గత మూడురోజులుగా రోజు 2 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో ఆందోళన నెలకొంది. అయితే వైన్ షాపుల ముందు జనం మాత్రం బారులు తీరారు. సామాజిక దూరం మాట మరచి, కొందరు మాస్క్ ధరించకుండా క్యూ లైన్‌లో నిల్చొని ఉన్నారు. ఆ వీడియోలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కరోనా విలయ తాండవం చేస్తోన్న సీఎం జగన్ ధన దాహం తీరడం లేదని మండిపడ్డారు.

లోకేశ్ రెండు వీడియోలను ట్వీట్ చేశారు. ఆ రెండు వీడియోల్లోనూ భారీగా జనం ఉన్నారు. కరోనా వైరస్ కేసులు ఇన్ని నమోదవుతన్న కొంచెం కూడా భయపడకుండా క్యూ లైన్‌లో ఉన్నారు. లిక్కర్ మాఫియా కోరలు చాచిందని లోకేశ్ మండిపడ్డారు. రోజు పదుల సంఖ్యలో జనం చనిపోతున్న వైన్ షాపుల ముందు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్న జగన్ ధన దాహం తీరడం లేదా అంటూ ధ్వజమెత్తారు.

coronavirus spread via liquor shops nara lokesh alleged..

వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న వైన్ షాపుల వద్ద జన సముహం ఏంటీ అని లోకేశ్ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టి మరీ జే ట్యాక్స్ పైసలు వసూల్ చేస్తుందన్నారు. కనీస జాగ్రత్తలు లేకపోవడంతో మద్యం దుకాణాలు కరోనా వ్యాప్తి నిలయాలుగా మారుతున్నాయని మండిపడ్డారు. జే ట్యాక్స్ మాత్రం రూ.25 వేల కోట్ల టార్గెట్ కోసం మద్యాన్ని ఏరులై పారిస్తోందని ధ్వజమెత్తారు.

English summary
coronavirus spreaded via liquor shops in andhra pradesh tdp national secretary nara lokesh alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X