గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చింతమనేనికి 25వరకు రిమాండ్: వైద్య పరీక్షలు..తరలింపు..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టు ఈ నెల 25వరకు రిమాండ్ విధించింది. అట్రాసిటీ కేసుల్లో ఉన్న చింతమనేని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. తన భార్య అనారోగ్యం కారణంగా ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. చింతమనేని రాక తెలుసుకున్న పోలీసులు ముందుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. చింతమేని రాగానే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వైద్య పరీక్షలు నిర్వహించి ఏలూరు ఎక్సైజ్ కోర్టులో చింతమనేనిని పోలీసులు హాజరుపరిచారు. చింతమేనిని ప్రభుత్వాసుపత్రికి తరలించిన సమయంలో ఆయన మద్దతు దారులు ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులు కోర్టులో హాజరు పర్చగా..రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం జగన్ 5 రూపాయాలు కూడా ఆదా చేయలేరు : చంద్రబాబుసీఎం జగన్ 5 రూపాయాలు కూడా ఆదా చేయలేరు : చంద్రబాబు

చింతమనేని అరెస్ట్ లో హైడ్రామా..
టీడీపీ మాజీ ఎమ్మెల్యే..విప్ చింతమనేని ప్రభాకర్ 12 రోజులుగా అజ్ఞాతం వీడి పోలీసుల ముందుకొచ్చారు. అట్రాసిటీ కేసులతో పాటుగా అనేక మంది చింతమనేని మీద పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆయన కోసం జిల్లా ఎస్పీ ప్రత్యేక పోలీసు టీంలను ఏర్పాటు చేసారు. ఎక్కడ ఉన్నారో తెలియక..ఆయన కోసం పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే..భార్య అనారోగ్యం కారణంగా చూడటానికి సొంత గ్రామానికి వస్తున్నానని చింతమనేని సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు ఆయన నివాసానికి చేరుకొని సోదాలు చేసారు. అక్కడకు చేరుకున్న చింతమేనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయం లో అక్కడ పెద్ద ఎత్తున ఆయన అనుచరులు చేరుకొని చింతమనేనికి అనుకూలంగా నినాదాలు చేసారు. ఆతరువాత ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చింతమనేనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏలూరు ఎక్సైజ్ కోర్టులో చింతమనేనిని పోలీసులు హాజరుపరిచారు. చింతమనేని ప్రభాకర్‌కు ఈనెల 25వరకు కోర్టు రిమాండ్ విధించింది. విప్ గా పని చేసిన చింతమనేని టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వివాదాస్పదంగా వ్యవహరించారు. ఆయన తీరు మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా జరిగిన వివాదంలో అట్రాసిటీ కేసు ఆయన పైన నమోదైంది. దీంతో..జిల్లా ఎస్పీ ఎలాగైనా చింతమేనని పట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి రంగంలోకి దించారు.

court ordered remand up to 25th ot this month for Ex mla Chintamaneni Prabhakar

పోలీసు అధికారుల మీద చర్యలు..
గతంలో చింతమనేని మీద ఫిర్యాదు వస్తే సరిగ్గా వ్యవహరించలేదనే కారణంతో పోలీసు అధికారుల పైనా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన మీద ఫిర్యాదులు వచ్చినా అధికార పార్టీకి చెందిన నేత కావటంతో స్థానిక పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఎన్నికల సమయంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్సదం అయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మీద వచ్చిన ఫిర్యాదుల మీద సీరియస్ గా స్పందించింది. అందులో భాగంగా తాజాగా నమోదైన కేసులతో పాటుగా పెండింగ్ లో ఉన్న కేసుల పైన పోలీసులు ఫోకస్ చేసారు. ఇక, ఇప్పుడు చింతమనేనికి రిమాండ్ విధించటంతో పోలీసులు కేసుల విచారణ వేగవంతం చేయనున్నారు.

English summary
court ordered remand up to 25th ot this month for Ex mla Chintamaneni Prabhakar. since 12 days chintamaneni abscond from police and filed pertion for anticiatory bail. He surrendered to day morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X