గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొవిడ్-19 నుంచి కోలుకున్న అంబటి రాంబాబు - మరో వారంపాటు హోం క్వారంటైన్ లోనే ..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన నేతలు ఎంత వేగంగా కరోనా కాటుకు గురయ్యారో.. అంతే వేగంగా కొవిడ్-19 వ్యాధి నుంచి రికవరీ అవుతున్నారు. బుధవారానికే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాధి నుంచి కోలుకుని, ఫామ్ హౌజ్ కు వెళ్లిపోగా, గురువారం మరో కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

సోము వీర్రాజు vs సుజనా చౌదరి - రాజధానిపై సంచలన వ్యాఖ్యలు - బీజేపీ చీఫ్‌తో ఎంపీ విభేదం సోము వీర్రాజు vs సుజనా చౌదరి - రాజధానిపై సంచలన వ్యాఖ్యలు - బీజేపీ చీఫ్‌తో ఎంపీ విభేదం

''మీ అందరి ఆశీస్సుల వల్ల కోలుకున్నాను. కరోనా సోకడంతో 10 రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకుని నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యి ఈరోజే ఇంటికి వచ్చాను. అయితే ఓ వారం పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు'' అంటూ అంబటి తన క్షేమ సమాచారాన్ని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే,

covid-19 in ap: ysrcp mla ambati rambabu recovered and discharged from hospital

Recommended Video

YSRCP MLA Ambati Rambabu Tested COVID-19 Positive,Video Gone Viral || Oneindia Telugu

ఏపీలో కొత్త కేసులు వరుసగా రెండో రోజు కూడా 10వేల మార్కును దాటాయి. బుధవారం ఒక్కరోజే 10,093 కొత్త కేసులు రాగా, గురువారం అంతకంటే ఎక్కువగా కొత్తగా 10,167 మందికి వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. మొత్తంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 1.30లక్షలకు పెరిగాయి. గురువారం ఒక్కరోజే 68 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 1,281కి పెరిగింది.

English summary
ysrcp mla ambati rambabu recovered from covid-19 and discharged from hospital on thursday. as per doctor's suggestion he will stay at home quarantine for one more week
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X