గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నన్నపునేని రాజకుమారిపై దళిత సంఘాలు ఫైర్ .. అరెస్ట్ చెయ్యాలని డీజీపీని కలిసిన ఆర్కే

|
Google Oneindia TeluguNews

ఛలో ఆత్మకూరు' ను అడ్డుకునే క్రమంలో భాగంగా టీడీపీ నాయకులను అడ్డుకున్న దళిత మహిళా ఎస్సై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారిపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆమెను తక్షణం అరెస్ట్ చెయ్యాలను దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓ మహిళా ఎస్సై మనస్థాపం చెందేలా అనుచిత వ్యాఖ్యలు చేయటం , కులం పేరుతో దూషించటంపై వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క ఈ ఘటనపై హోం మంత్రి సుచరిత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

స్మశాన వాటికకు వైసీపీ రంగులు .. ఫైర్ అయిన ఎంపీ కేశినేని నానీస్మశాన వాటికకు వైసీపీ రంగులు .. ఫైర్ అయిన ఎంపీ కేశినేని నానీ

చంద్రబాబు నివాసం వద్ద చలో ఆత్మకూరు సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి 'దళితుల వల్లనే దరిద్రం' అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నోరు జారి మాట్లాడారని మహిళా ఎస్సై చేసిన ఫిర్యాదుతో నన్నపునేని రాజకుమారిపై ఎస్సే ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది .
కానీ తాను ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చెయ్యలేదని ,ఆ ఆరోపణలు కరెక్టు కాదని స్పష్టం చేశారు నన్నపునేని రాజకుమారి . మహిళా ఎస్సైని అవమానకరంగా మాట్లాడినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకునేందుకు తాను సిద్ధమని ఆమె సంచలన వ్యాఖ్యలుచేసిన ఆమె కావాలనే వైసీపీ ప్రభుత్వం తనను వేధిస్తుంది అని చెప్పారు.

Dalit leaders and R.k demands to take action Nannapaneni rajakumari

మరోవైపు నన్నపనేనిపై వైసీపీ, దళిత సంఘాలు , మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళగిరిలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి . నన్నపనేనిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చెయ్యటంతో పాటు ఆమెపై చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు కోరారు. . ఇంకో వైపు డీజీపీ గౌతం సవాంగ్‌ను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. నన్నపనేని తక్షణమే అరెస్ట్ చేయాలని వినతిపత్రం అందజేశారు. మొత్తానికి తాజా పరిణామాలు టీడీపీ మహిళా నేత నన్నపునేనికి పెద్ద చిక్కు తెచ్చి పెట్టాయి.

English summary
The YCP and Dalit groups and women's groups have been ignited on the issue of Nannapuneni raja kumari. a protest in Mangalgiri to against her comments . Dalit leaders have demanded immediate arrest of Nannapuneni and also demanded take action against her. . On the other hand, MLA Ramakrishna Reddy met with DGP Goutam Sawang and represented a letter on Nannapuneni .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X