• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చపాతీ కర్రతో కొట్టి అత్తను హతమార్చిన కోడలు.. ఏపీలో దారుణం; ఆ కుటుంబంలో విషాదం !!

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఓ మర్డర్ ఓ కుటుంబానికి భవిష్యత్ లేకుండా చేసింది. గుంటూరు జిల్లా తెనాలిలో వివాహిత అనుమానాస్పద మృతి వెనుక మిస్టరీని ఛేదించారు పోలీసులు. గంగానమ్మపేటలోని ప్యారడైస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 306 లో శనివారం రాత్రి తాడికొండ మైధిలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన ఇంట్లో మైధిలి రక్తపుమడుగులో పడి ఉండడం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమె మరణం గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఆమెను హత్య చేశారా, హత్య ఎందుకు జరిగింది అన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

కన్నబిడ్డపై తల్లి క్రూరత్వం : చేతులు, కాళ్ళు విరిచేసి, రక్తం కారేలా కొడుతూ నిత్య నరకం, ఆ వీడియోలు భయానకం !!కన్నబిడ్డపై తల్లి క్రూరత్వం : చేతులు, కాళ్ళు విరిచేసి, రక్తం కారేలా కొడుతూ నిత్య నరకం, ఆ వీడియోలు భయానకం !!

చపాతీ కర్రతో అత్తను హతమార్చిన కోడలు

చపాతీ కర్రతో అత్తను హతమార్చిన కోడలు

అత్త మైధిలి వేధింపులు తట్టుకోలేక కోడలు రాధా ప్రియాంక అత్తను హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరులోని తెనాలిలో నివాసముంటున్న కోడలు ప్రియాంకను అత్త నిత్యం వేధింపులకు గురి చేసేది. అత్త వేధింపులు తట్టుకోలేకపోయిన కోడలు రాధా ప్రియాంక ఆమె పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో అత్త నిద్రిస్తున్న సమయంలో ఆమెపై చపాతీ కర్రతో దాడి చేసింది. అంతేకాదు కూరగాయలు కోసే కత్తి తో అత్తపై దాడి చేసింది. చపాతీ కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అత్త మైధిలి అక్కడికక్కడే మరణించింది.

కోడలిని అరెస్ట్ చేసిన పోలీసులు.. దెబ్బ తిన్న కుటుంబం

కోడలిని అరెస్ట్ చేసిన పోలీసులు.. దెబ్బ తిన్న కుటుంబం


అత్త వేధింపులు భరించలేక తీవ్ర అసహనంతో ఉన్న కోడలు ఆమెను హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తెనాలి టూ టౌన్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు మిస్టరీని ఛేదించిన టూటౌన్ పోలీసులను డీఎస్పీ స్రవంతి రాయ్ అభినందించారు. ఈ కేసులో కోడలిని వేధించిన అత్త కోడలు చేతిలో దారుణ హత్యకు గురికాగా, అత్తను చంపిన కోడలు జైలు పాలయ్యింది. ఫలితంగా ఆ ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా దారుణంగా మారిపోయాయి. తల్లి చనిపోయి,కట్టుకున్న భార్య హంతకురాలిగా మారి మైథిలి తల్లి, బార్య హత్యకు గురై మైధిలి భర్త తీవ్ర వేదనలో ఉన్నారు. వారి పిల్లలు కూడా చివరికి బాధితులుగా మారిపోయారు.

అత్తాకోడళ్ళు సర్దుకుపోతే సమస్యలే ఉండవు

అత్తాకోడళ్ళు సర్దుకుపోతే సమస్యలే ఉండవు

కలిసిమెలిసి ఉండాల్సిన అత్తాకోడళ్లు బద్ద శత్రువులు గా ప్రవర్తించడం, ఆపై హత్యలకు, ఆత్మహత్యలకు కారణంగా మారడం ఇటీవల కాలంలో అనేక చూస్తున్నాం. కోడలిని అత్త, తమ బిడ్డ అని భావించి ప్రేమగా చూసుకుంటే, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా తమ పిల్లలే అని సర్దుకుంటే గొడవలు రాకుండా ఉంటాయి. అంతేకాదు ఇక అత్తను కూడా కోడలు తమ తల్లిలానే భావించి ఆమె పెద్దరికాన్ని గౌరవిస్తూ, ఒకవేళ ఏదైనా విషయానికి కోపగించుకున్నా సర్దుకుని పోతే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.

కుటుంబం సంతోషంగా ఉండాలంటే, బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే సర్దుకుపోవాల్సిందే

కుటుంబం సంతోషంగా ఉండాలంటే, బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే సర్దుకుపోవాల్సిందే


ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవడం లోనే కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. అలా కాకుండా అత్తలు కోడళ్లను వేధించినా, కోడళ్ళు అత్తలను సాధించినా ఇంట్లో ఉండే మగవారికి ప్రశాంతత లేకపోవడమే కాకుండా, పరిస్థితులు హత్యలు, ఆత్మహత్యలు దాకా వెళతాయి. దీనివల్ల కుటుంబ వ్యవస్థ మొత్తం గాడి తప్పుతుంది. ఫలితంగా ఆ ఇళ్ళల్లో ఉండే చిన్నారుల భవితవ్యం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది.

English summary
Police have confirmed that daughter in law Radha Priyanka killed her mother in law as she could not bear the harassment of her aunt Maithili. According to police, Priyanka was constantly harassed by her aunt, who lives in Tenali, Guntur. Radha Priyanka, the daughter - in - law, who could not bear the harassment of her aunt attacked on her aunt with a vegetable chopping knife and roti stick. Aunt Maithili died on the spot due to severe bleeding after being hit hard on the head with a roti stick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X