గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..! సీఎం చెప్పినట్లుగానే.. మాజీ సీఎంకు సెక్యూరిటీ..! ఎలాగో తె

|
Google Oneindia TeluguNews

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు భ‌ద్ర‌త పైన టీడీపీ ఆరోప‌ణ‌ల‌కు డీజీపీ గౌతం స‌వాంగ్ స‌మాధానమిచ్చారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్వేచ్ఛ ఇచ్చార‌ని..ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ..టీడీపీ ఒక‌రి గురించి మ‌రొక‌రు ఫిర్యాదులు చేస్తున్నార‌ని..వ్య‌క్తిగ‌త అంశాల‌ను సైతం రాజ‌కీయ కోణంలో చూడ‌టం వ‌ల‌నే ఇటువంటి ఆరోప‌ణ‌లు ఎదుర‌వుతున్నాయ‌న్నారు. ఏపీలో ప్ర‌తీ ప్రాంతంలో స్పంద‌న కార్య‌క్ర‌మం మ‌రింత స‌మ‌ర్దవంతంగా అమ‌లు చేసి ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా పోలీసు వ్య‌వ‌స్థ‌ను తీసుకెళ్తామ‌న్నారు స‌వాంగ్.

చంద్ర‌బాబుకు ఎక్కువ భ‌ద్ర‌తే ఇచ్చాము...
డీజీపీ గౌతం స‌వాంగ్ ను వైసీపీ..టీడీపీ నేత‌లు వేర్వేరుగా క‌లిసారు. టీడీపీ నేత‌లు కుట్ర పూరితంగా వైసీపీ శ్రేణుల మీద దాడులు చేయిస్తోంద‌ని ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఫిర్యాదు చేసారు. ఆ వెంట‌నే డీజీపీని క‌లిసిన టీడీపీ నేత‌లు వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు టీడీపీ కార్య‌కర్త‌లు మ‌ర‌ణించార‌ని..వైసీపీ శ్రేణ‌లు 130 దాడుల‌కు దిగార‌ని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. వీటి మీద స్పందించిన డీజీపీ అధికార ప‌క్ష‌మైనా.. ప్ర‌తి ప‌క్ష‌మైనా ఫిర్యాదులు చేస్తే ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు భ‌ద్ర‌త అంశం పైనా డీజీపీ స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే ఇచ్చామని డీజీపీ తేల్చి చెప్పారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ఎవ‌రినీ ఉపేక్షించేది లేద‌ని స‌వాంగ్ స్ప‌ష్టం చేసారు.

DGP Sawang stated that Chandra Babu security is above the need. Police did not taken any new decision on his security.

జ‌గ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసారు..
శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పోలీసుల‌కు పూర్తి స్వేచ్చ‌నిచ్చార‌ని డీజీపీ చెప్పుకొచ్చారు. సీఎం సూచ‌న‌ల మేర‌కు స్పంద‌న కార్య‌క్ర‌మం పేరుతో అన్ని జిల్లాల ఎస్పీలు..సీపీ కార్యాల‌యాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. దీనికి ప్ర‌జ‌ల నుండి అపూర్వ స్పంద‌న వ‌స్తుంద‌ని వివ‌రించారు. రాబోయే రోజుల్లో స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ‌లోకి తెస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీ మేర‌కు ప్రత్యేక హోదా ఉద్యమ కేసుల మాఫీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్న‍ట్లు చెప్పారు. ఏ రాజ‌కీయ పార్టీ ఫిర్యాదులు ఇచ్చినా స్వీక‌రించి వాటిలో నిజా నిజాలు తెలుసుకుంటామ‌ని..అవ‌స‌ర‌మైన రీతిలో చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసారు. కొంద‌రు వ్య‌క్తిగ‌త వివాదాల‌ను సైతం రాజ‌కీయంగా మ‌ల‌చి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌న్నారు. ఏపీలో ప్ర‌జ‌ల కోసం పూర్తి స్థాయిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

English summary
AP DGP Gowtam Sawang stated that Chandra Babu security is above the need. Police did not taken any new decision on his security. Police concentrated on Freindly policing in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X