tdp leaders nara lokesh threatens ycp ys jagan victory tdp AP Panchayat elections 2021 ap local body elections panchayat elections nimmagadda ramesh kumar ap government andhra pradesh amaravati ramesh kumar ap news నారా లోకేష్ బెదిరింపులు వైసిపి టిడిపి పంచాయతీ ఎన్నికలు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి politics
డెమోక్రసీకి జగన్ మోనోక్రసీకి మధ్య ఎన్నికలు ... విజయం వైసీపీదే అయినా .. లోకేష్ సెన్సేషన్
టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంచాయతీ ఎన్నికల్లో అసలు సిసలు గెలుపు టిడిపిదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా ఎన్నికలు జరిగిన అన్ని పంచాయతీల్లో పాలకవర్గాలు ఏర్పాటు కూడా జరిగింది . అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలవడంతో వైసిపి హవా కొనసాగింది అని వైసీపీ నేతలు సంకలు గుద్దుకుంటుంటే సంఖ్యాపరంగా వైసీపీదే విజయం అయినప్పటికీ అసలు విజేతలు తామేనని మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా .. లోకేష్ కు చురకలు

జగన్ రెడ్డి అరాచకాలకు పాల్పడినా, ధైర్యంతో పోరాడిన టీడీపీ సేన
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నడూలేని విధంగా జగన్ రెడ్డి అరాచకాలకు పాల్పడినా, ధైర్యంతో ఎదురొడ్డి నిలిచి గెలిచిన టిడిపి కార్యకర్తలు ,నేతలు, అభిమానులు ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించిన నారా లోకేష్ డెమోక్రసీకి జగన్ మోనోక్రసీకి మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదే అయినా, అసలు సిసలు గెలుపు మాత్రం టీడీపీదే అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు .

ఎన్నికల్లో అర్ధరాత్రి జగన్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి స్వాతంత్రం వచ్చింది
అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను వైయస్ జగన్ తన రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారని విమర్శించారు.
ఇదే సమయంలో మన దేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వస్తే నాలుగు విడతల పంచాయతీ ఎన్నికలలో అర్ధరాత్రి జగన్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి స్వాతంత్రం వచ్చింది అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. టిడిపి మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను చంపేశారని , నామినేషన్ వేశారని బెదిరించారని ,భయపెట్టారని ,కట్టేసి కొట్టారని పేర్కొన్న లోకేష్ ఎన్ని చేసినప్పటికీ వెనక్కి తగ్గని టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారన్నారు .

అడుగడుగునా దాడులు , బెదిరింపులు .. అయినా పోరాడిన టీడీపీ శ్రేణులు
టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో ఉంటే కరెంటు నిలిపివేశారు అంటూ ఆరోపించారు . కౌంటింగ్ కేంద్రాలకు తాళాలు వేశారని , పోలీసులతో బెదిరించి దాడులు చేశారని , టిడిపి మద్దతుదారులు గెలిచిన చోట్ల రీ కౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపును ప్రకటించుకున్నారు అంటూ లోకేష్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ పై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ టిడిపి కార్యకర్తలు నేతలు ధైర్యంగా పోరాటం చేశారని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారని నారా లోకేష్ పేర్కొన్నారు.