గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య : కుమారుడితో గొడవ : చికిత్స పొందుతూ కన్నుమూత..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదారాబాద్ లోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే గుర్తించిన ఇంట్లోని వ్యక్తులు ఆయన్ను బసవ తారకం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు గుర్తించారు చివరి వరకు పోరాడినా ఆయన ప్రాణం దక్కలేద. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు స్వల్ప హార్ట్ అటాక్ కు గురయ్యారు. ఆ తరువాత అల్లుడు మనోహర్ ఆస్పత్రిలో చికిత్స పొంది కొద్ది రోజుల క్రితమే డిస్చార్జ్ అయ్యారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లారు.

కుమారుడు తో జరిగిన గొడవతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కోడెల కుమారుడు..కుమార్తె పై వచ్చిన ఆరోపణలతో కోడెల తీవ్రంగా మనస్థాపానిక గురయ్యారు. కే టాక్స్ పేరుతో ఆయన కుటుంబం భారీగా వసూళ్లు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో ఫర్నీచర్ ను సైతం తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫర్నీచర్ ను అసెంబ్లీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ లు తప్పించుకొనేందుకు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు.

Ex speaker Kodela siva Prasa suicide in hyderabad house.

వరుసగా వస్తున్న వివాదాలు..ఆరోపణల పైన కుమారుడుతో చర్చ సమయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని సమాచారం. దీంతో..ఆయన అవమానాలు తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డారు. ఇంట్లో పని చేసే వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తన ఇమేజ్ మొత్తం డామేజ్ అయినట్లుగా కోడెల కొద్ది రోజులుగా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన తాను ఉన్న పరిస్థితి తట్టుకోలేక పోతున్నానంటూ వాపోయారు. దీంతో...ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.. ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పరిస్థితి చేయి దాటిపోయిందని తెలుస్తోంది. దీని పైన ఆస్పత్రి అధికారిక బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది.

English summary
Ex speaker Kodela siva Prasa suicide in hyderabad house. In basava Taraka Hospital Kodela under treatment he lost his life. docotrs to announce officially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X