• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే - ఏపీ సీడ్స్ ద్వారా నకిలీ విత్తనాలు కొని - సీఎం జగన్‌ దృష్టికి

|

ఇప్పటిదాకా.. నకిలీ విత్తనాలు కొని, పంట నష్టపోయి, బలవన్మరణానికి పాల్పడిన పేద రైతుల ఉదంతాలు ఎన్నో చూశాం. విత్తనాల్లో మోసాలు సామాన్య రైతులకే కాదు, సాక్ష్యాత్తూ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సైతం చవిచూశారు. నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటూ సీఎం జగన్ అధికారులను పదే పదే హెచ్చరిస్తున్నా.. రాష్ట్రంలో మాఫియా జోరు తగ్గలేదనడానికి నిదర్శనంగా తాసా ఉదంతం నిలిచింది. వివరాల్లోకి వెళితే..

బీజేపీకి వైసీపి డైరెక్షనా? - కన్నా నేను ఒకటే -చంద్రబాబు, జగన్‌ కవలలు -ఇదీ అసలు కథ: సోము వీర్రాజు

రైతు ఎమ్మెల్యే ఆర్కే..

రైతు ఎమ్మెల్యే ఆర్కే..

ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతి కొలువుదీరిన మంగళగిరి నియోజకవర్గానికి రెండో సారి ఎమ్మెల్యేగా పనిచేస్తోన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే తనను తాను రైతుగా చెప్పుకోడానికే ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ప్రజాసేవ నుంచి ఏమాత్రం సమయం దొరికినా వెంటనే పొలానికెళ్లి వ్యవసాయం చేయడం ఆయన అలవాటు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో తనకున్న పొలంలో ఈసారి ఆయన వరి పంట వేశారు. నాట్లు వేయడం పూర్తయిన పొలానికి నిన్న ఆదివారం వెళ్లి చూడగా ఆర్కే షాకయ్యారు..

20 శాతం బెరుకు విత్తనాలు..

20 శాతం బెరుకు విత్తనాలు..

పొలంలో 20 శాతం నారు సరిగా పెరగకపోవడంతో తాను పెట్టినవి నకిలీ విత్తనాలని ఎమ్మెల్యే ఆర్కే గుర్తించారు. సదరు విత్తనాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ సీడ్స్ నుంచి కొనుగోలు చేసి ఉండటంతో నేరుగా గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు.. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేశారు. ‘‘ఈరోజు చేనికి వెళ్ళాను.. ఏపీ సీడ్స్ వద్ద కొన్న వరి వంగడాలలో కేళీలు (బెరుకు విత్తనాలు) 20 శాతం ఉన్నట్లు గుర్తించా'' అని ఎమ్మెల్యే తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.

సీఎం జగన్ దృష్టికి..

సీఎం జగన్ దృష్టికి..

తన పొలంలో వేసిన నకిలీ విత్తనాలు.. మంజీరా సీడ్స్ కంపెనీకి చెందినవని, ఏపీ సీడ్స్ ద్వారానే వాటిని కొనుగోలు చేశానని వ్యవసాయ అధికారులకు చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే.. సంబంధిత బిల్లులను సైతం అధికారులకు అందజేశారు. తన పొలంలోని బెరుకు విత్తనాలను వ్యవసాయ శాస్త్ర వేత్తలు సైతం పరిశీలనకు తీసుకెళ్లారని, అతి త్వరలోనే రిపోర్టులు కూడా ఇస్తామన్నారని ఎమ్మెల్యే తెలిపారు. విత్తనాలు తయారు చేసిన మంజీరా సీడ్ కంపెనీ, సరఫరా చేసిన నంద్యాల సంస్థపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని, ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా తీసుకెళతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇదిలా ఉంటే,

రూ.113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ..

రూ.113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ..

ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రైతంగానికి ఊరట కల్పిస్తూ, ఏపీ సర్కారు వ్యవసాయ పంటలకు రూ.113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని సోమవారం విడుదల చేసింది. కృష్ణా నది, గోదావరి నది, కుందూ నది వరదలతో దెబ్బతిన్న పంటలకు ఈ ఇన్‌పుట్ సబ్సిడీ వర్తించనుందని, 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలకు మాత్రమే ప్రస్తుతం సబ్సిడీ ఇస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తద్వారా ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు మాత్రమే సబ్సిడీ విడుదలైంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటలకు రూ.22.59 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లిస్తారు. మే-సెప్టెంబర్ మధ్య వరదలకు నష్టపోయిన ఉద్యాన పంటలకు కూడా చెల్లించనున్నారు. విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లా ఉద్యానపంటల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించనున్నారు.

ముగిసిన మొదటి దశ ప్రచారం-71 సీట్లకు 28న పోలింగ్-2.14కోట్ల ఓటర్లు-1066 అభ్యర్థులు-పూర్తి లెక్కలివే..

ముగిసిన మొదటి దశ ప్రచారం-71 సీట్లకు 28న పోలింగ్-2.14కోట్ల ఓటర్లు-1066 అభ్యర్థులు-పూర్తి లెక్కలివే..

English summary
mangalagiri YSRCP MLA Alla Ramakrishna Reddy deceived with fake seeds. while mlas purchased Manjira seeds through AP Seeds, lost 20 per cent of his pady craft. He lodged a complaint with the Guntur district agriculture authorities. He said the matter would be taken up with CM Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X