గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు చేతికి ఎమైంది..? కట్టుతో కనిపించిన టీడీపీ అధినేత..!! విశ్రాంతి కోసం హైదరాబాద్ కు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు చేతికి కట్టు || Chandrababu Naidu Suffering With Hand Pain || Oneindia Telugu

అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి కట్టుతో కనిపించారు. కుడి చెయ్యి వంచడానికి వీలు లేకుండా ఆయన సపోర్ట్ గా కట్టు కట్టుకుని ఉండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాస్త కంగారు పడ్డారు. ఏమైందంటూ ఆయనను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ దృశ్యం కనిపించింది. చంద్రబాబు మణికట్టు నొప్పితో బాధపడుతున్నారని, రెండురోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందని డాక్టర్లు సూచించినట్లు తెలియడంతో కుదుట పడ్డారు.

<strong>పంద్రాగస్టు సంరంభం: విజయవాడలో వైఎస్ జగన్: జిల్లాల్లో జెండాలను ఎగురవేసేది వీరే..</strong>పంద్రాగస్టు సంరంభం: విజయవాడలో వైఎస్ జగన్: జిల్లాల్లో జెండాలను ఎగురవేసేది వీరే..

విజయవాడలో ఏర్పాటైన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా చంద్రబాబు చేతికి కట్టుతో కనిపించారు. ఆయన కుడి చేతి నరంపై బెణికిందని, దానిపై ఒత్తిడి పెరిగడం వల్ల మెలిపెడుతున్న నొప్పి బాధించిందని చంద్రబాబు పార్టీ నాయకులకు వివరించారు.

Former CM and TDP President Chandrababu suffering with palm pain

రెండురోజుల పాటు అరచెయ్యి గానీ, వేళ్లు గానీ వంచకూడదని సూచించినట్లు చెప్పారు. చెయ్యి వంగడానికి వీలు లేకుండా ఈ కట్టును కట్టినట్లు తెలిపారు. నొప్పి మరింత తీవ్రం కాకుండా ఉండటానికి, నరంపై ఒత్తిడి పడకుండా ఉండేలా వైద్యులు కట్టు కట్టినట్లు తేలింది. దీనితో రెండు రోజుల విశ్రాంతి తీసుకోవడానికి చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్తారు. చంద్రబాబు చేతికి కట్టు కట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

English summary
Telugu Desam Party Supremo and former Chief Minister Chandrababu Naidu is suffering with hand pain. Former Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has been suffering from his hand pain. According to the reports, TDP Chief has been suffering from pain in his right-hand fingers. It is said that there was swelling on the nerves of his right-hand fingers and he was suggested by the doctors to take rest for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X