గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇంటి సమీపంలో నాలుగు కరోనా కేసులు- ఇద్దరు వాలంటీర్లు సహా.... హై అలర్ట్

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ మినహాయింపుల పుణ్యమాని కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పుడు ఏకంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం సమీపంలో ఇవాళ ఏకంగా నాలుగు కేసులు బయటపడ్డాయి. క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కట్ట క్రిస్టియన్ పేటలో ఇవి నమోదయ్యాయి. దీంతో సీఎం క్యాంపు కార్యాలయ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

సీఎం ఆఫీసు పక్కనే ఉన్న కరకట్టపై ఒకే రోజు నాలుగు కేసులు వెలుగుచూడటం ఓ ఎత్తయితే ఇందులో ఇద్దరు గ్రామ వాలంటీర్లే కావడం మరింత కలకలం రేపుతోంది.

four coronavirus positve cases found near cm jagans house

వీరిద్దరూ మూడు రోజుల క్రితం ఇంటింటికీ తిరిగి వంద ఇళ్లలో పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో అక్కడి వారి నుంచి వీరికి సోకిందా లేదా కాలనీలో ఎవరి నుంచైనా వైరస్ వ్యాప్తి చెందిందా అన్న అంశంపై ఇప్పుడు అధికారులు దృష్టిసారించారు.
సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శానిటైజేషన్ చర్యలు చేపడుతున్నారు.

four coronavirus positve cases found near cm jagans house

Recommended Video

Lockdown 5 : Restaurants And Hotels To Reopen From June 8 In Andhra Pradesh

తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న వీదిలోని ఓ అపార్టమెంట్లో గతంలో రెండు కేసులు వెలుగుచూశాయి. అయితే కనీసం నాలుగు కేసులు వస్తేనే రెడ్ జోన్ గా ప్రకటిస్తామని అప్పట్లో గుంటూరు కలెక్టర్ పేర్కొన్నారు. ఈసారి నాలుగు కేసులు రావడంతో మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అదీ వాలంటీర్ల ద్వారా వైరస్ ఎంతమందికి సోకి ఉంటుందో తెలియని పరిస్దితుల్లో ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తేనే మంచిదని స్ధానికులు కోరుతున్నారు.

English summary
four coronavirus postive cases including two volunteers has been detected near andhra pradesh chief minister ys jagan's camp office at tadepalli in guntur district today. officials alert and implement sanitazation measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X