గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గర్బిణీకి డెలివరీ: రిపోర్టులో కరోనా పాజిటివ్, వైద్యుడు, ఏడుగురు నర్సులు హోం క్వారంటైన్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఎక్కడ, ఎప్పుడూ ఎలా ఎవరి నుంచి సోకుతుందో అర్థం కావడం లేదు. అయితే ఇటీవల గుంటూరులో ఓ గర్బిణీ.. నిండుచూలాలు. డెలివరీ సమయం కావడంతో జీజీహెచ్ వద్దకొచ్చింది. అయితే వైద్యులు సిబ్బందితో కలిసి సర్జరీ చేశారు. అంతకుముందు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది గుండె గుబేల్ మంది. వెంటనే వారిని హోం క్వారంటైన్‌కి తరలించారు.

గర్బిణీ డెలివరీ..

గర్బిణీ డెలివరీ..

జీజీహెచ్ ఆస్పత్రికి 7వ తేదీన గర్బిణి వచ్చింది. అయితే అప్పటికే మహిళ నుంచి శాంపిల్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. విషయం తెలియని వైద్యులు డెలివరీ కోసం సిద్దం చేశారు. ఆ రోజునే డాక్టర్, 8 మంది నర్సులు కలిసి సర్జరీ చేశారు. తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఈ నెల 9వ తేదీన బాలింతకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. ఆమెకు కరోనా పాజిటివ్ ఉంది అని తెలిసి వైద్య సిబ్బంది ఆందోళన చెందారు. ఆపరేషన్ చేసిన సదరు వైద్యుడు, సిస్టర్లను హోం క్వారంటైన్‌కి తరలించారు.

ఉలిక్కపడ్డ సిబ్బంది

ఉలిక్కపడ్డ సిబ్బంది

బాలింతకు కరోనా పాజిటివ్ ఉంది అని తేలడంతో జీజీహెచ్ ఆస్పత్రి ఉలిక్కిపడింది. వైరస్ సోకిన సదరు బాలింతను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మరోవైపు పసికందు రక్త నమూనాలను సేకరించారు. వైద్యుడు, సిబ్బందిని వారం రోజులు హోం క్వారంటైన్‌కు తరలించారు.

పెరుగుతున్న కేసులు

పెరుగుతున్న కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 38 మంది కాగా.. విదేశాల నుంచి వచ్చినవారు 9 మంది ఉన్నారు. వీరితో కలిసి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 261కి చేరింది. ఒక్కరోజులో వైరస్ సోకి ఇద్దరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 80కి చేరింది. కరోనా వైరస్ తగ్గి 2540 మందిని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. ప్రస్తుతం 1641 మందికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

English summary
ggh doctor and staff went to home quarantine due to treatment of corona effected woman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X