గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళను ట్రాప్ చేసి బాగా వాడుకున్నాడు.. సీఐ వెంకట్ రెడ్డి రాసలీలల గుట్టు రట్టు.. సస్పెన్షన్ వేటు

|
Google Oneindia TeluguNews

అతను.. మోడల్ పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేసేవాడు.. ఓ వివాదంలో ఫిర్యాదు చేయడానికొచ్చిన మహిళలను తెలివిగా ట్రాప్ చేసి.. రకరకాల హామీలిచ్చి.. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అన్ని రకాల అవసరాలకు బాగా వాడుకుని వదిలేశాడు.. సీఐ చేతిలో మోసపోయానని తెల్సుకున్న ఆ మహిళ.. డిపార్ట్ మెంట్ లోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ విచారణలో సదరు సీఐ రాసలీలలు గుట్టురట్టయ్యాయి. దీంతో సస్పెన్షన్ వేటు పడింది. గడిచిన కొద్ది నెలల్లో గుంటూరు జిల్లాలో లైంగిక వేధింపుల కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవడం ఇది నాలుగో సారి.

సీఐ వెంకట్ రెడ్డి వంకర బుద్ధి..

సీఐ వెంకట్ రెడ్డి వంకర బుద్ధి..

గుంటూరు సిటీలోని నగరపాలెం పోలీస్ స్టేషన్ ను కొంతకాలం కిందటే మోడల్ స్టేషన్ గా మార్చారు. అక్కడ సీఐగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి.. లక్షణమైన భార్య ఉన్నప్పటికీ వంకరబుద్ధితో వ్యవహరించాడు. ఫిర్యాదు చేయడానికొచ్చిన మహిళలను ట్రాప్ చేసి, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సదరు మహిళ.. వెంకటరెడ్డి తనను మోసం చేశారని అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు ఎంక్వైరీ జరిగింది.

సస్పెన్షన్ వేటు..

సస్పెన్షన్ వేటు..

ఐజీ ఆదేశం మేరకు గుంటూరు ఎస్పీ రామకృష్ణ విచారణ చేపట్టగా.. బాధిత మహిళ చేసిన ఆరోపణలన్నీ నిజమని తేలింది. దీంతో సీఐ వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే గుంటూరు సిటీలో అచ్చం సీఐ వెంకట్ రెడ్డిలాగే గతంలో ఫిర్యాదు చేయడానికొచ్చిన మహిళలను లైంగికంగా వేధించిన ఉదంతంలో ఇద్దరు ఎస్సైలు, ఒక కానిస్టేబుల్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో పోలీసు శాఖపై విమర్శలు పెరిగాయి.

బయటికొస్తున్న బాధితురాళ్లు..

బయటికొస్తున్న బాధితురాళ్లు..

పౌరుల్ని, చట్టాల్ని కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్ మెంట్ లో లైంగిక వేధింపులను సీరియస్ గా తీసుకుంటామని కొంతకాలం కిందటే అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా ఎస్పీ రామకృష్ణ భరోసా ఇవ్వడంతో బాధితురాళ్లు ఒక్కొక్కరుగా బయటికొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. లైంగిక ఆరోపణల కేసుల్లో ఎస్సైలు, సీఐలు వరుసగా సస్పండ్ అవుతుండటంతో డిపార్ట్ మెంట్ పరువు గంగలో కలుస్తోందని అధికారులు వాపోతున్నారు.

Recommended Video

PK Means Not Pawan Kalyan 'Pichhi Kukka' : Jogi Ramesh || Oneindia Telugu
గుంటూరు రేంజ్ లో గబ్బు పనులు..

గుంటూరు రేంజ్ లో గబ్బు పనులు..

గుంటూరు జిల్లా పోలీసులపై గతంలోనూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, గుంటూరు రేంజ్ పరిధిలోకి వచ్చే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ పోలీసులు గబ్బు పనులు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. మహిళల్ని వేధించడం ఒకటైతే, ప్రతి కేసులోనూ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుండటం, అత్యాచారాలు, నేరాలపై నియంత్రణలో సరిగా పనిచేయడంలేదనే ఆరోపణలు రావడం తెలిసిందే. ఇద్దరు ఎస్సైల తర్వాత తాజాగా సీఐపై ససస్పెన్షన్ వేటుతోనైనా శాఖలో మార్పులొస్తాయని ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు.

English summary
Guntur district, Nagarampalem police station circle inspector venkat reddy has been suspended on sexual harassment charges on thursday. he is the fourth police officer who have sacked. in january two sub inspectors and a constable suspended on same charges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X