గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు రేవ్ పార్టీ కేసు- అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐ వెంకటేశ్వరరావు సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

తాజాగా గుంటూరులో కలకలం రేపిన రేవ్ పార్టీ కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బన్ సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావుపై పోలీసులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన్ను వెంటనే విధుల నుంచి తప్పించారు. రేవ్ పార్టీలో పాల్గొన్నందుకు సీఐ వెంకటేశ్వరరావుపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

గుంటూరులో తాజాగా జరిగిన జన్మదిన వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్‌లో సోమవారం రాకేష్‌ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో కొందరు అసభ్య నృత్యాలు చేశారు.

guntur urban ccs ci venkateswara rao suspended for participating in rave party

Recommended Video

Janasena Silence Over BJP's Fight Against AP Govt| YSRCP | Tippu Sultan | AP | Oneindia Telugu

ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న గుంటూరు పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్‌ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడంతో పాటు పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోద చేశారు. అనంతరం సొంత పూచీకత్తులపై పంపించేశారు. అయితే జరిగిన పార్టీకి అర్బన్‌ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారని తేలడంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు.

English summary
guntur police on today suspended urban ccs ci venkateswarao on participation in rave party recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X