గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ మహిళా నేత రేవతి మెడకు మరో వివాదం: మేనల్లుడి వీరంగం: ఆసుపత్రి సిబ్బందిపై దౌర్జన్యం

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ దేవళ్ల రేవతి మెడకు మరో వివాదం చుట్టుకుంది. ఇప్పటికే కాజా టోల్‌గేట్ వద్ద చోటు చేసుకున్న ఘటనతో వివాదాలు, కేసుల్లో కూరుకునిపోయిన ఆమె పేరు..మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. టోల్‌గేట్ వివాదం చల్లారక ముందే.. మేనల్లుడి రూపంలో మరో గండాన్ని ఎదుర్కొంటున్నారామె. వెంటవెంటనే చోటు చేసుకున్న ఈ పరిణామాలు దేవళ్ల రేవతిని రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టోల్‌గేట్ సిబ్బందిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలోకి విడుదలైన కొన్ని గంటల్లోనే మరో వివాదం ఆమెను ఉక్కిరిబిక్కిరికి గురి చేసినట్టయింది.

ఏ2గా: వైసీపీ మహిళా నేతపై ఎఫ్ఐఆర్: సీఎంకు చెప్పి ఉద్యోగాలు తొలగిస్తానంటూ బెదిరింపుఏ2గా: వైసీపీ మహిళా నేతపై ఎఫ్ఐఆర్: సీఎంకు చెప్పి ఉద్యోగాలు తొలగిస్తానంటూ బెదిరింపు

తాజాగా- దేవళ్ల రేవతి మేనల్లుడు గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలోని ఓ నర్సింగ్ ‌హోమ్‌లో వీరంగం సృష్టించాడు. ఆసుపత్రి సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై చేయి చేసుకున్నాడు. అతని పేరు వడియా రాజు. దేవళ్ల రేవతికి సమీప బంధువు. కాజా టోల్‌ప్లాజా వద్ద దేవళ్ల రేవతి సృష్టించిన వీరంగం తరహాలోనే అతను కూడా దాచేపల్లి ఆసుపత్రి సిబ్బందిపై రెచ్చిపోయాడు. సిబ్బందిని కొట్టాడు. దీనికి సంబంధంచిన దృశ్యాలు ఆసుపత్రిలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Guntur: YSRCP Woman leader Revati nephew Vadiyaraju allegedly creating ruckus in hospital

Recommended Video

Toll Plaza ఘటనపై వైసీపీ నాయకురాలు రేవతి వివరణ - కేసు నమోదు | CCTV Footage | YSRCP Revathi

ఇదే ఆసుపత్రిలో అతను చికిత్స పొందాడు. అనంతరం డిశ్చార్జి చేసే సమయంలో బిల్లు మొత్తం గురించి నర్సింగ్‌హోమ్ సిబ్బందితో ఘర్షణకు దిగాడు. అధిక బిల్లులను వేశారని వాదించాడు. తాను అంత మొత్తాన్ని చెల్లించేది లేదంటూ భీష్మించాడు.. వారితో గొడవ పెట్టుకున్నాడు. దీనితో వడియారాజు, నర్సింగ్‌హోమ్ సిబ్బంది మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీనితో ఆగ్రహించిన వడియారాజు.. ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశాడు. సిబ్బందిని కొట్టాడు. తాను వైసీపీ నాయకుడినని బెదిరింపులకు గురి చేసినట్లు నర్సింగ్ హోమ్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. అకారణంగా అతను తమపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని వాపోతున్నారు.

English summary
Ruling YSR Congress Party woman leader and AP Vaddera welfare Corporation Devalla Revati nephew Vadiyaraju allegedly creating ruckus in a Private hospital at Dachepalli in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X