• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భార్య నగ్న వీడియోలు లైవ్‌ స్ట్రీమింగ్‌ -నచ్చితే పంపుతానని బేరాలు -గుంటూరు కేసులో మరో ట్విస్ట్‌

|

భార్య నగ్న వీడియోలు ఆమెకు తెలియకుండా తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసిన కీచక భర్త కేసులో మరిన్ని కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు సిటీలోని ఏటీ అగ్రహారానికి చెందిన మహిళ ఫిర్యాదు మేరకు దిశా పోలీస్ స్టేషన్ లో ఆమె భర్తపై కేసు నమోదైంది. భర్తను విచారించిన క్రమంలో ఇంకొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్‌లు ఓపెన్ -సర్కారు ఉత్తర్వులు -టాలీవుడ్‌కు కేసీఆర్ బంపర్ ఆఫర్లు

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన ఓ యువతిని మూడేళ్ల కిందట ఇదే నగరానికి చెందిన యువకుడు.. తాను ఎయిర్ ఫోర్స్ ఉద్యోగినంటూ నమ్మించి, భారీగా కట్నకానుకలు తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత.. ఎయిర్ పోర్టు, విమానాలను చూపించాలంటూ భార్య కోరడంతో అసలు విషయం బయటపడింది. ఎయిర్ ఫోర్స్ అంటూ అతను చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. చివరికి పెద్దలు సర్దిచెప్పడంతో భార్యాభర్తల కలిసి ఉండటానికి అంగీకరించారు. మధ్యలో ఓ కొరియర్ సంస్థను పెట్టి, ఆర్థికంగా దెబ్బతిన్న ఆ యువకుడు.. తన జల్సాల కోసం సులువుగా డబ్బులు సంపాదించాలనుకుని, అందుకు భార్యనే పావుగా వాడుకుంటూ నీచానికి దిగాడు..

భార్య నగ్న వీడియోలు ఇంటర్నెట్‌లో -ఈజీ మనీ కోసం ఓ భర్త వికృతం -గుంటూరు దిశ స్టేషన్‌లో కేసు

భార్య వీడియోలు ‘లైవ్‌ స్ట్రీమింగ్‌’..

భార్య వీడియోలు ‘లైవ్‌ స్ట్రీమింగ్‌’..

ఏ పనీ చేయకుండా, భార్య ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్న ఆ భర్త.. పరాయి మగాళ్ల దగ్గరికి వెళ్లాలంటూ ఒత్తిడి చేయడంతో ఆమె హతాశురాలైంది. మాటవినకపోతే చచ్చిపోతానంటూ బెదిరింపులకు దిగడంతో భయపడిపోయి దిశ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించి, దర్యాప్తు బాధ్యతను డీఎస్పీ సుప్రజకు అప్పగించారు. బాధితురాలిని ఓదార్చిన మహిళా డీఎస్పీ.. అన్ని రకాలుగా అండగా నిలబడతామని భరోసా ఇవ్వడంతో భర్త అకృత్యాలను ఆమె పూసగుచ్చినట్లు వివరించింది. అరెస్టు తర్వాత విచారణలోనూ కీచక భర్త నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. వీడియోలను బహిర్గతం చేయటంతో పాటు ‘లైవ్‌ స్ట్రీమింగ్‌' యాప్‌ ద్వారా తన భార్య ఆశ్లీలంగా ఉన్న దృశ్యాలను డబ్బుల కోసం చూపించేవాడని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

వీడియో చూపించి, బేరసారాలు..

వీడియో చూపించి, బేరసారాలు..

లైవ్ స్ట్రీమింగ్ యాప్ ల ద్వారా భార్య నగ్న వీడియోలను చూపించే విషయంలో కీచక భర్త ప్రొఫెషనల్ మాదిరిగా వ్యవహరించడం గమనార్హం. ముందుగా ఆమె నిద్రపోతున్నప్పుటి వీడియోలను పోస్ట్ చేసి, రానురాను ఆమెతో ఏకాంతంగా గడిపిన వీడియోలను కూడా అప్ లోడ్ చేసేవాడు. ఇక లైవ్ స్ట్రీమింగ్ యాప్ లలోనైతే నిర్ణీత సమయం కేటాయించి.. ఆ టైమ్ కు లైవ్ లోకి వచ్చే వాళ్లందరి దగ్గరా డబ్బులు తీసుకుంటూ, భార్య ఆశ్లీల దృశ్యాలను చూపించేవాడు. నచ్చితే ఆమెను మీ దగ్గరికి కూడా పంపుతానని బేరసారాలు చేసేవాడు. అధిక మొత్తంలో ఆఫర్ చేసినవాళ్లను ఎంచుకుని, వాళ్ల దగ్గరికి వెళ్లాలంటూ భార్యను ఒత్తిడి చేసేవాడు. అతను పెట్టే మానసిక క్షోభ భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాగా..

  Telangana, Andhra Likely To Experience Heatwave Conditions: IMD
  కదిలిన డొంక.. అదుపులో ఇంకొందరు?

  కదిలిన డొంక.. అదుపులో ఇంకొందరు?

  భార్యకు సంబంధించి వికృత భర్త పోస్టు చేసిన వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తోన్న పోలీస్ ఐటీ విభాగం.. అదే సమయంలో సదరు వీడియోలను ఎంత మంది చూశారు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎందరు కనెక్ట్ అయ్యారనే అంశాలను కూడా కూపీ లాగుతున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... వీడియోల కోసం డబ్బులు చెల్లించిన కొద్ది మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు అర్బన్‌ ఉన్నతాధికారులు, ఐటీ కోర్‌ విభాగంతోపాటు సాంకేతిక నిపుణత కలిగిన సిబ్బందిని కేటాయించి నిందితులకు శిక్షలు పడేలా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాతో అన్నారు.

  English summary
  More new facts are coming to light in the case of gunturu husband, who took nude videos of his wife without her knowledge and uploaded them on social media. In addition to exposing the videos, it was revealed that the husband was showing his wife pornographic scenes for money through the 'live streaming' apps. The police investigation revealed that the husband also pressured his wife to commit prostitution.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X