గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పల్నాడు పై టీడీపీది అసత్య ప్రచారం అని హోం మంత్రి సుచరిత ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఛలో పల్నాడు అరెస్టులపై మాట్లాడారు. సచివాలయంలో మాట్లాడిన మంత్రి పల్నాడు లో టిడిపి నాయకులపై దాడులు జరుగుతున్నాయని టిడిపి అసత్య ప్రచారం చేస్తున్నదంటూ ఆమె మండిపడ్డారు. అనుమతిలేకుండా ర్యాలీలు నిర్వహించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు.

<strong>నన్నపునేని రాజకుమారిపై దళిత సంఘాలు ఫైర్ .. అరెస్ట్ చెయ్యాలని డీజీపీని కలిసిన ఆర్కే</strong>నన్నపునేని రాజకుమారిపై దళిత సంఘాలు ఫైర్ .. అరెస్ట్ చెయ్యాలని డీజీపీని కలిసిన ఆర్కే

ఇక అంతే కాదు టిడిపి నాయకులు, దళిత ఎమ్మెల్యేలను, అధికారులను కించపరుస్తూ మాట్లాడుతున్నారని, అలాంటి వారిని సహించేది లేదని, ఎవరైనా మాట్లాడితే చర్యలు తప్పక తీసుకుంటామని హెచ్చరించారు. పల్నాడు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్న విమర్శలు ఎంత మాత్రమూ కరెక్ట్ కాదని మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఆత్మకూరులో 144 సెక్షన్ విధించినా, ఉన్న ఆత్మకూరులో ర్యాలీ చేయాలనుకోవడం తప్పని ఆమె పేర్కొన్నారు. పల్నాడులో ఏదో జరిగిపోతోందని టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. టీడీపీ స్వార్థ రాజకీయం చెయ్యాలని ప్రయత్నం చేసిందని, అయితే అది పల్నాడులో పని చేయలేదన్నారు మంత్రి మేకతోటి సుచరిత.

Home Minister Sucharita fires on TDPs false propaganda on palnadu

టీడీపీ శిబిరం నుంచి కార్యకర్తలు ఎందుకు వెళ్లిపోతున్నారో ప్రజలు గమనిస్తున్నారని సుచరిత వ్యాఖ్యానించారు. ఆత్మకూరులో అంత ప్రశాంతంగా ఉంటే, అక్కడే ఏదో జరిగినట్టు హడావుడి చేస్తున్నారని టిడిపి నేతలపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తహశీల్దార్‌ వనజాక్షి, మరో ఐపీఎస్‌ అధికారిపైనా ప్రజాప్రతినిధులు దాడికి తెగబడినా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు అదే టిడిపి కావాలని ప్రతి వ్యవహారాన్ని రాద్దాంతం చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పని చేస్తోందని మండిపడ్డారు. అలా చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు

English summary
Andhra Pradesh Home Minister Mekothoti Sucharitha spoke on the arrests of tdp leaders about chalo palnadu. Speaking at the secretariat, the minister said she was furious over the TDP's false propaganda that there were attacks on TDP leaders in Palnadu. She said the rallies were conducted without permission and tried to disrupt peace keeping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X