గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిజర్వ్ బ్యాంకు ఖాళీ చేసేలా అప్పులు... సాయం అందక రైతుల కన్నీటి వరద : లోకేష్ ధ్వజం

|
Google Oneindia TeluguNews

భారీ వర్షాలు వరదలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై, పట్టించుకోని వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. భారీ వర్షాలు వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నా , పంటలు మునిగిపోయినా, రోడ్లు చెరువులు అవుతున్నా ఏపీ ప్రభుత్వానికి పట్టింపు లేదని లోకేష్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీల పై కంప్లైంట్ లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా అంటూ నారా లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

వరదలు, బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా ?

వరదలు, బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా ?

ఒక్కరోజన్నా కాలు బయటపెట్టి బాధితుల గోడు విన్నారా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు లోకేష్. వరదలు బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా అంటూ ప్రశ్నించిన లోకేష్ రాష్ట్రంలో రైతుల కన్నీటి వరద ప్రవహిస్తోంది అంటూ మండిపడ్డారు. వర్షాలు వరదల కారణంగా రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని, రైతుల గురించి పట్టించుకునే ఆలోచన లేదని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.

రాష్ట్రంలో మెట్ట రైతుల కంట కన్నీటి వరద ప్రవహిస్తోందని మండిపడ్డారు లోకేష్ .

రిజర్వ్ బ్యాంకు ఖాళీ చేసేలా అప్పులు చేసినా .. రైతులకు రూపాయి కూడా అందని సాయం

రిజర్వ్ బ్యాంకు ఖాళీ చేసేలా అప్పులు చేసినా .. రైతులకు రూపాయి కూడా అందని సాయం


అధిక వర్షాలు, వరదలకు పత్తి, వేరుశనగ ,మిర్చి, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయి . రైతులు తీవ్రంగా నష్టపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వు బ్యాంకు ఖజానా ఖాళీ అయ్యేంతగా అప్పులు దూసి తెస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వం ఇంత వరకు రైతులకు రూపాయి కూడా సాయం చేసింది లేదు అంటూ ఆయన పేర్కొన్నారు . ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో చేసుకుంటున్నారంటూ లోకేష్ మండిపడ్డారు.

ఏపీలోని ప్రభుత్వం తీసుకు వస్తున్న వేల కోట్ల అప్పులు ఎటు పోతున్నాయో రైతులకు తెలియడం లేదంటూ మండిపడ్డారు లోకేష్ .

Recommended Video

Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu
వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోండి : లోకేష్ విజ్ఞప్తి

వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోండి : లోకేష్ విజ్ఞప్తి

ఇప్పటికైనా నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.వాళ్ళ కష్టాలు కాస్త ఆలకించండి ముఖ్యమంత్రి గారు అంటూ నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను ఇప్పటికైనా పట్టించుకోవాలి అంటూ కోరారు . వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజల, రైతుల సమస్యలను పరిష్కరించడం లేదని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతుంది .

English summary
TDP national general secretary Nara Lokesh was outraged at the YCP government's negligence in the state due to heavy rains and floods. Lokesh fires back that the AP government does not care about farmers. Inthe state crops are submerged and roads are becoming ponds. Nara Lokesh has criticized Chief Minister YS Jaganmohan Reddy saying the state should not take action except to file complaints against judges back around Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X