గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబే నేటికీ మా సీఎం .. అందుకే సీఎం చంద్రబాబు అనే సంబోధిస్తున్నా అన్న గల్లా అరుణ

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు కార్యాలయానికి వెళ్ళటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకుగాను సోమవారం మొదటిసారిగా చంద్రబాబుకు మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఆ కార్యక్రమంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

ఆమె పెళ్ళికి, రాజకీయానికి ఆసక్తికరమైన లింక్ ఉందన్న మంత్రి పుష్ప శ్రీవాణి ఆమె పెళ్ళికి, రాజకీయానికి ఆసక్తికరమైన లింక్ ఉందన్న మంత్రి పుష్ప శ్రీవాణి

గల్లా అరుణ కుమారి ఆసక్తికర వ్యాఖ్యలు ... అధికారం లేదు అయినా సీఎం చంద్రబాబే అన్న గల్లా

గల్లా అరుణ కుమారి ఆసక్తికర వ్యాఖ్యలు ... అధికారం లేదు అయినా సీఎం చంద్రబాబే అన్న గల్లా

చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్ళటంతో చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలతో కళకళలాడింది. చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. మంగళగిరిలో నిర్మిస్తున్న ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వచ్చే వరకు నిత్యం ఇక్కడ అందుబాటులో ఉంటూ.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఇక ఈ కార్యక్రమంలో ప్రధానంగా గల్లా అరుణ కుమారి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా సాగాయి. ప్రజలు సీఎంగా జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టినా మీరే మా సీఎం అని ఆమె తన ప్రసంగం అంతా సీఎం చంద్రబాబు అని కొనసాగించటం ఆసక్తికరంగా మారింది.

తన ప్రసంగం అంతా సీఎం చంద్రబాబు అనే సంబోధించిన గల్లా అరుణ కుమారి

తన ప్రసంగం అంతా సీఎం చంద్రబాబు అనే సంబోధించిన గల్లా అరుణ కుమారి


గుంటూరులోని టిడిపి కార్యాలయంలో ప్రతిపక్ష నాయకుడు , మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి టిడిపి నాయకురాలు , మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మాట్లాడారు. చంద్రబాబు పట్ల తన అభిమానాన్ని ఆమె తన మాటలతోనే వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు గారు అంటూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. అది విన్న వాళ్ళు ఆమె పొరబాటున అలా అన్నారనుకున్నరేమో అనుకునే లోపే చంద్రబాబును ముఖ్యమంత్రిగా పిలవాలని కోరుకుంటున్నాను, మాజీ ముఖ్యమంత్రిగా కాదు అని ఆమె కావాలనే అలా సంబోధించానని క్లారిటీ ఇచ్చారు. ప్రజా తీర్పు ఏదైనా మాకు మాత్రం సీఎం చంద్రబాబే అన్నారు.

కేబినేట్ సబ్ కమిటీ లోని మంత్రులే అవినీతిపరులు .. దేనికీ భయపడాల్సిన అవసరం లేదు అన్న గల్లా

కేబినేట్ సబ్ కమిటీ లోని మంత్రులే అవినీతిపరులు .. దేనికీ భయపడాల్సిన అవసరం లేదు అన్న గల్లా

ఇక తన ప్రసంగం అంతా ఆమె చంద్రబాబును సిఎం అని పేర్కొన్నారు. చాలా మంది మహిళలు , అభిమానులు చంద్రబాబుకే ఓటేసినా ఎందుకు అధికారంలోకి రాలేదు అని ఆవేదన చెందారని చెప్పిన గల్లా అరుణ కుమారి ఇక చాలా మంది అభిమానులు తమకు సీఎం అంటే చంద్రబాబే అని పేర్కొన్నారని చెప్పారు. పోల్ ఫలితాలతో ఎవరూ నిరాశ చెందవద్దని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉత్సాహంతో పనిచేయాలని ఆమె పార్టీ కార్యకర్తలను కోరారు. దాడులకు భయపడవద్దని , సీఎం చంద్రబాబు బాటలో సాగుదామని చెప్పి ఆమె పడే పడే చంద్రబాబును సీఎం అని పేర్కొన్నారు. టిడిపి పాలనలో అవినీతిపై దర్యాప్తు చేయడానికి కేబినెట్ సబ్‌ కమిటీ వేశారని కానీ ఆ సబ్ కమిటీలో నియమించిన మంత్రులు అవినీతిపరులు అని అరుణ ఆరోపించారు. దేనికీ భయపడకుండా కుల మతాలకు అతీతంగా టీడీపీ అన్ని అని భావించి ముందుకు సాగి మళ్ళీ సీఎంగా చంద్రబాబును చెయ్యాల్సిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు.

English summary
Addressing party workers in the presence of Opposition leader N Chandrababu Naidu at TDP office in Guntur, TDP leader and former Minister Galla Aruna Kumari said she wants to call Chandrababu as Chief Minister, not as former Chief Minister. Throughout her speech, she referred to Chandrababu as CM. She asked party activists not to be disheartened with the poll results and work with enthusiasm for forthcoming local body elections. Aruna alleged that Ministers, who were appointed in cabinet sub-committee to probe corruption in TDP rule, are corrupt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X