గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నక్సలైట్లలో కలిసిపోతా.. అనుమతివ్వాలని రాష్ట్రపతికి దళిత యువకుడు మొర, వీడియో ట్వీట్..

|
Google Oneindia TeluguNews

ఇసుక అక్రమాలను అడ్డుకొన్న దళిత యువకుడు వరప్రసాద్.. గుర్తున్నాడు కదా... అయితే అతను సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మాజీ సర్పంచ్‌తో గొడవ, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి శిరోముండనం చేసిన ఘటనలో తనకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని వాపోయారు. మాజీ సర్పంచ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపారు. పైగా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో పోస్ట్ చేయగా.. దానిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

జరగని న్యాయం.. కలత చెందిన ప్రసాద్..


తనకు న్యాయం జరగకపోవడంతో కలత చెందానని ప్రసాద్ తెలిపారు. తాను నక్సలైట్లలో కలిసి పోవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇందుకు తనకు రాష్ర్టపతి అనుమతి ఇవ్వాలని విన్నవించాడు. నక్సలైట్లలో కలిసిపోతే.. తన సమస్యను తానే పరిష్కరించుకుంటామని వీడియోలో చెప్పారు. తనపై దాడి చేసి, శిరోముండనం చేసినవారిపై నెల గడుస్తోన్నా చర్యలు తీసుకోకపోవడంపై బాధపడ్డారు. తన ముందే మాజీ సర్పంచ్ తిరుగతున్నారని.. పైగా తనపైనే ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.

పరాకష్టకు చేరిన జగన్ సర్కార్ వివక్ష..


జగన్ సర్కార్ వివక్ష పరాకష్టకు చేరిందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. బంగారు భవిష్యత్ ఉన్న ప్రసాద్ నక్సలిజం వైపు వెళ్లాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. అతని ఇంత కఠినంగా మాట్లాడేందుకు కారణం.. జగన్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఇసుక అక్రమాలకు అడ్డుపడ్డాడని శిరోముండనం చేసి.. దాడి చేశారని గుర్తుచేశారు. కానీ సదరు వైసీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. జగన్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రశ్నిస్తే దళితులను చంపేస్తారా అని ప్రశ్నించారు. చేసిన తప్పుకు దళిత జాతికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రసాద్‌కి తగిన న్యాయం చేయాలని కోరారు.

Recommended Video

Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో గొడవ...

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో గొడవ...

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైసీపీ నేత ఇసుక అక్రమ రవాణాను దళిత యువకుడు వరప్రసాద్ గతనెలలో అడ్డుకున్నారు. అయితే అతనిని పోలీసు స్టేషన్ తీసుకెళ్లి దాడి చేయడమే గాక.. శిరోముండనం చేశారు. అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది. వెంటనే ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేసి.. చేతులు దులుపుకున్నారు. కానీ తనకు న్యాయం జరగలేదని వరప్రసాద్ మళ్లీ మీడియా ముందుకొచ్చారు. మాజీ సర్పంచ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదు అని.. తననే సూటి పోటీ మాటలు అంటున్నారని ప్రసాద్ చెప్పారు. అందుకే నక్సలైట్లలో కలవాలని నిర్ణయం తీసుకున్నానని వివరించారు.

English summary
iam going to maoist group..please give permission dalit youth prasad asked president of india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X