గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారంలోకి వచ్చాక భారీ ప్రక్షాళన చేసిన సీఎం జగన్ .. ఎవర్ని ఎక్కడ నియమించారంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమారు వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ ప్రక్షాళనకు పూనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన భారీగా ఐఏఎస్ ల ను బదిలీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అంతా అవినీతిమయంగా మారినట్లు భావించిన జగన్, తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా వివిధ శాఖల్లో అధికారుల పనితీరును సమీక్షించి బదిలీలు నిర్వహించారు.

 మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ట్విస్ట్ .. ఆ నిందితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ట్విస్ట్ .. ఆ నిందితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు

ఏపీలో ఐఏఎస్ ల భారీ బదిలీలు .. తనమార్క్ పాలన కొనసాగిస్తున్న జగన్

ఏపీలో ఐఏఎస్ ల భారీ బదిలీలు .. తనమార్క్ పాలన కొనసాగిస్తున్న జగన్


మొత్తం 42 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక శాఖల వారీగా బదిలీల వివరాలు చూస్తే వ్యవసాయ మరియు సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న బుడితి రాజశేఖర్ ను పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ ఫర్ చేసారు. ప్రస్తుతం స్పెషల్ సెక్రటరీగా మార్కెటింగ్ మరియు సహకార శాఖలో పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి ని వ్యవసాయ మరియు సహకార శాఖ కు పూర్తి అడిషనల్ ఛార్జ్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇక ఇంటర్మీడియట్ బోర్డ్ పూర్తి అడిషనల్ చార్జ్ నిర్వహిస్తున్న బి ఉదయ లక్ష్మి ని కార్మిక ఉపాధి శిక్షణ మరియు పరిశ్రమల శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీ గా బదిలీ చేశారు.

ఇక ఆమె స్థానంలో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గా వ్యవహరిస్తున్న కాంతిలాల్ దండే ను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు కమిషనర్ తో పాటు సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు.

42 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ ఆదేశాలను జారీ చేసిన ప్రభుత్వం

42 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ ఆదేశాలను జారీ చేసిన ప్రభుత్వం

పోస్ట్ కోసం వెయిటింగ్ లో ఉన్న శశిభూషణ్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖ సెక్రటరీగా నియమించారు. సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్పీ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖ ( GPM & AR) అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖ సెక్రటరీగా పనిచేసిన ముద్దుల రవిచంద్రను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు ముఖేష్ కుమార్ మీనా స్థానంలో బదిలీ చేశారు. ఇక ముఖేష్ కుమార్ మీనాను గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీగా బదిలీ చేశారు.

ఆర్కియాలజీ మరియు మ్యూజియమ్స్ శాఖలో కమిషనర్ గా ఉన్న వాణిమోహన్ ను సహకార శాఖ మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ డైరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ కు కమిషనర్ గా బదిలీ చేశారు. ఇక వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వరప్రసాద్ ను కార్మిక శాఖ కమిషనర్ గా నియమించారు.

ఎవరు ఏ స్థానంలో ఫిట్ అనేది చూసి జగన్ నిర్ణయం .. అందులో భాగంగానే భారీ బదిలీలు .. బదిలీలు ఇలా

ఎవరు ఏ స్థానంలో ఫిట్ అనేది చూసి జగన్ నిర్ణయం .. అందులో భాగంగానే భారీ బదిలీలు .. బదిలీలు ఇలా

యూత్ సర్వీసెస్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్టెప్ కు కమిషనర్ గా పనిచేసిన భాను ప్రకాష్ ను ఇండస్ట్రీస్ మరియు కామర్స్ డిపార్టుమెంటుకు , ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఎండి గా బదిలీ చేశారు. ఇక ఆ స్థానంలో పనిచేస్తున్న వెంకయ్య చౌదరి సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొన్నారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో స్పెషల్ కమిషనర్ గా ఉన్న అరుణ్ కుమార్ ను వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ గా నియమించారు. ఇక ఆస్థానంలో పనిచేసిన ప్రవీణ్ కుమార్ ను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా , ఏపీ టూరిజం అథారిటీకి సిఇఒగా నియమించారు. ఇక పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న కన్నబాబు ను విపత్తు నివారణ స్పెషల్ కమిషనర్ గా మరియు ఎక్స్అఫిషియో అడిషనల్ సెక్రటరీ గా రెవెన్యూ శాఖకు నియమించారు. ఇక ఆస్థానంలో పనిచేసిన ప్రసన్న వెంకటేష్ విజయవాడ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖలకు కమిషనర్ గా నియమించారు. ఇక ఆ స్థానంలో పనిచేస్తున్న రామారావు వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఇక పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న కార్తికేయ మిశ్రా ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు ఎం హెచ్ ఎం మిషన్ డైరెక్టర్ గా నియమించారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న నాగలక్ష్మి ని విశాఖపట్నం విద్యుత్ శాఖ ఎండీగా బదిలీ చేశారు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న గిరీశ పి ఎస్ ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా తుడా వీసీ గా నియమించారు. ఇక ఆ స్థానంలో పనిచేసిన విజయరామరాజును ఏపీ మార్క్ ఫెడ్ మరియు ఏపీ ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా పనిచేస్తున్న చక్రధర బాబు ను ఏపీ ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రిజన గుమ్మల్లను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఇక ఆస్థానంలో పనిచేసిన హరి నారాయణన్ ను ఏపీ ఐ ఐ సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించారు.

పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న రంజిత్ భాషను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించారు. ఆస్థానంలో పనిచేసిన గంధం చంద్రుడును ఏపీ షెడ్యూలు కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.

పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న సాగిలి షాన్ మోహన్ ను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్న శివశంకర్ ను విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. పార్వతీపురం ఐటిడిఎ పిఓ గా పనిచేస్తున్న లక్ష్మీశ ను తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ సీఈఓగా మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన దినేష్ కుమార్ ను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఆ స్థానంలో పనిచేస్తున్న హిమాన్షు శుక్లాను ఆప్కో ఎండీగా బదిలీ చేశారు. ఆస్థానంలో పనిచేసిన నాగరాణి ని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొన్నారు.

ఇక అడిషనల్ డైరెక్టర్ గా పని చేస్తున్న చినవీరభద్రుడు ను పాఠశాల విద్యాశాఖ, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా బదిలీ చేశారు .ఇక ఆస్థానంలో పనిచేసిన శ్రీనివాసులు ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. గుంటూరు డివిజన్ కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న రాజబాబును సర్ఫ్ సీఈవోగా బదిలీ చేశారు. ఉపాధి శిక్షణ శాఖ లో డైరెక్టర్ గా పనిచేసిన మాధవిలతను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇక ఆమె స్థానంలో పనిచేసిన కృతికా శుక్లాను స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న గౌతమిని వైఎస్ఆర్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇక ఆమె స్థానంలో పనిచేసిన కోటేశ్వరరావును సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయవలసిందిగా పేర్కొన్నారు.

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసిన ప్రశాంతిని అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నిర్మించారు. విశాఖపట్నం డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్న కే శ్రీనివాసులు ను శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ లో జాయింట్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ గా ఉన్నా మార్కండేయులు ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ గా ఉన్న వినోద్ కుమార్ ను పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ గా బదిలీ చేశారు రాజమండ్రి సబ్ కలెక్టర్ గా ఉన్న సాయి కాంత్ వర్మను సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా బదిలీ చేశారు.

డైరెక్టర్ జనరల్ ఎస్ పి ఎఫ్ గా ఉన్నా ఎం ప్రతాప్ ను ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ కు ఎండీగా బదిలీ చేశారు. వాటర్ షెడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా ఉన్న రమణా రెడ్డి ని నెడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఏపిలో తన మార్కు పాలన చూపించాలనుకున్న జగన్ అందులో భాగంగానే ఐఏఎస్ లను బదిలీ చేస్తూ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.

English summary
After coming to power in AP once again, YS Jaganmohan Reddy launched a massive cleansing campaign. It was against this backdrop that he transferred heavily to IASs. Considering that everything has become corrupt in the past, Jagan has decided to check for corruption in government departments. As part of this, the performance of the officers in various departments was reviewed and transfers made
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X