గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యంపై పొంతన లేని స్టేట్మెంట్లు .. వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ అంటున్న లోకేష్

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునేందుకు దృష్టి సారించి ముఖ్యంగా మద్యపాన నిషేధం పై దృషి సారించారని తెలుసు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ చీఫ్ జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరిగింది. ముందు బెల్ట్ షాపులకు చెక్ పెట్టనున్నారని , మద్యంపై కొత్త పాలసీ తీసుకురానున్నారని ప్రజల్లో చర్చ జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది . ఇక ఈ నేపధ్యంలో మద్యంపై పరస్పర విరుద్ధంగా జగన్ స్టేట్ మెంట్స్ ఉన్నాయని అసలింతకీ జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్ .

గ్రామ వాలంటీర్ల ఎంపిక ఆపండి ...జీవో 104ను నిలిపివేయండి ... హైకోర్టులో పిల్గ్రామ వాలంటీర్ల ఎంపిక ఆపండి ...జీవో 104ను నిలిపివేయండి ... హైకోర్టులో పిల్

 మద్యనిషేధం చేస్తానన్న జగన్ కు నారా లోకేష్ సూటి ప్రశ్న

మద్యనిషేధం చేస్తానన్న జగన్ కు నారా లోకేష్ సూటి ప్రశ్న

మద్యం కారణంగా మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీరు తుడుస్తానని మాట ఇచ్చిన జగన్ నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కానీ ఇదే సమయంలో మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టం తెచ్చామని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. "మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి" "మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే" అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్ మెంట్లు ఇచ్చారు జగన్ , అసలింతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వైఎస్ జగన్ గారూ?" అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు నారా లోకేష్ .

మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే అంటున్న జగన్ .. అసలింతకీ ఏం చెప్పాలనుకుంటున్నారన్న లోకేష్

మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే అంటున్న జగన్ .. అసలింతకీ ఏం చెప్పాలనుకుంటున్నారన్న లోకేష్

అంతే కాదు మొదటి బడ్జెట్లో మద్యం మీద ఆదాయాన్ని గత ఏడాదికన్నా రూ. 2,297 కోట్లు ఎక్కువ అంచనా వేసారు. ఒక పక్క మధ్య నిషేధం అంటూనే మద్యం మీద ఆదాయం పెరుగుతుందని లెక్క చెప్పారు. ఇక ఇప్పుడేమో ఏకంగా ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అంటున్నారని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలింతకే తమరు ఏం చెయ్యబోతున్నారు అని సూటి ప్రశ్న సంధించారు. ప్రభుత్వమే మద్యం షాపులు నడిపితే ఇక మన వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ అంటూ సెటైర్లు వేశారు నారా లోకేష్ . ఇసుక వాలంటీర్లు తరువాత, మద్యం వాలంటీర్లు.. పండగ చేసుకోండి అని ట్వీట్ చేసిన మద్యం విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.

జగన్ పరస్పర విరుద్ధమైన ప్రకటనపై ప్రజల్లోనూ సందిగ్ధం

జగన్ పరస్పర విరుద్ధమైన ప్రకటనపై ప్రజల్లోనూ సందిగ్ధం

ఏడాదికి 20 శాతం చొప్పున వచ్చే ఐదేళ్లలో మొత్తం దుకాణాలను రద్దు చేయాలని నిర్ణయించిన జగన్ సర్కార్ ఆ పని పక్కన పెట్టి ఇప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలనే నిర్ణయం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు . ప్రజలలోనూ సందిగ్ధం నెలకొంది. ఏది ఏమైనా ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చిన జగన్ సర్కార్ మద్యపాన నిషధం విషయంలో ఏం చెయ్యబోతుందో .. ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ మద్యనిషేధ విషయంలో ఇంకెన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉందో అని ఇదంతా చూస్తున్న ఏపీ ప్రజలు భావిస్తున్నారు.

English summary
Jagan said that human relations are ruined by alcohol and that he would shed tears. But at the same time, former minister Narak Lokesh said that AP CM YS Jagan's comment that the law was passed by handing over the responsibility of selling alcohol by the government . "Human relations with alcohol are ruined" "State government is responsible for the sale of alcohol"" the two statements are different . What do you want to say, YS Jagan?" Asked Nara Lokesh on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X