గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ విధానాలతో రాష్ట్రం రివర్స్ అభివృద్దిలో పయనిస్తుంది : చంద్రబాబు నాయుడు

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్‌మోహన్ రెడ్డి మొండితనం వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ నేపథ్యంనే రాష్ట్రంలో ప్రస్తుతం రివర్స్ అభివృద్ది జరుగుతుందని అన్నారు. ఆయన వ్యవహార శైలితోనే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలని ఆయన విమర్శించారు. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్ కోసం కేంద్రం తోడ్పాటుతో తెచ్చిందని...కాని వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచిందని ఆయన దుయ్యబట్టారు.

ఏపీలో విద్యుత్ సంక్షోభంపై చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. కేంద్రం తోడ్పాటుతో రాష్ట్రంలో 9 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చామని చెప్పారు. కాని జగన్ ప్రభుత్వం మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని అన్నారు. పీపీఏలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిన ఫలితమే రాష్ట్రంలో దుస్థితికి కారణమని అన్నారు.

jagan is stuborn : chanadrababu naidu

థర్మల్ విద్యుత్ ఆధారపడదగినది కాదని , ఇది పర్యవరణ హితం కాదని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కోన్నారు. అయితే ఈ పరిణామాలను ముందే ఊహించి సౌర, మరియు పవన విద్యుత్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించానని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు తెలియదు ఇతరులు చెబితే వినరని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

English summary
Tdp president chandrababu naidu criticised cm jaganmohan reddy on power crisis. he says that jagan is stuborn
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X