గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులకు లక్ష్మణ రేఖ గీసిన జగన్ .. విధానపరమైన నిర్ణయాలు తనకు చెప్పకుండా ప్రకటించొద్దన్న సీఎం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ తన క్యాబినెట్ మంత్రులకు అందరం ఏకతాటి మీదే నడవాలని దిశానిర్దేశం చేస్తూ లేఖ రాశారు. అందరి లక్ష్యం ఒకేలా ఉండాలని, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమని ఆయన మంత్రులకు సూచించారు. ఒకరి దారి ఒక్కొక్కటిగా ఉంటే గమ్యానికి చేరుకోవటం కష్టమవుతుందన్న జగన్ అంతా ఒకే మాట మీదముందుకు నడవాలని చెప్పారు. ఈ నెల పదిన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన జగన్ అప్పుడు చెప్పటంతో పాటు మరోమారు మంత్రులకు దిశా నిర్దేశం చేస్తూ తాజాగా మంత్రులకు ఒక కీలక నోట్ పంపారు.

చంద్రబాబు యూరప్ ట్రిప్ నుండి వచ్చే లోపు అంతా అయిపోతుంది అన్న బీజేపీ నేత షాకింగ్ కామెంట్ చంద్రబాబు యూరప్ ట్రిప్ నుండి వచ్చే లోపు అంతా అయిపోతుంది అన్న బీజేపీ నేత షాకింగ్ కామెంట్

మంత్రులకు జగన్ లేఖ .. అందరూ ఏకతాటి మీద పని చెయ్యాలని సూచన

మంత్రులకు జగన్ లేఖ .. అందరూ ఏకతాటి మీద పని చెయ్యాలని సూచన

తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఏపీ సీఎం జగన్ ఒక స్పష్టమైన విజన్ తో మాట్లాడారు. తన ప్రభుత్వ ప్రయారిటీలకు సంబంధించి స్పష్టత ఇచ్చిన జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎరావర్చతమే లక్ష్యం అని అన్నారు. ఇక ఏపీలో తన మంత్రి వర్గంలో కొత్తగా మంత్రులు అయిన వారు తమ తమ శాఖల పరిధిలో తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన తాజాగా తన మంత్రులకు లక్ష్మణరేఖ గీస్తూ లేఖ రాశారు. ప్రభుత్వ ప్రాధాన్యత మొత్తం ఎన్నికలకు ముందు నుంచి హామీ ఇస్తున్న నవరత్నాల అమలేనని అయన ఆ లేఖలో పేర్కొన్నారు. చివరి లబ్థిదారు వరకూ హామీల ఫలాలు అందాలన్న విషయాన్ని మంత్రులకు తెలియజేయటంతో పాటు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పారు.

మంత్రులు విధానపరమైన నిర్ణయాల ప్రకటన తనతో చెప్పకుండా ప్రకటించవద్దు అన్న జగన్

మంత్రులు విధానపరమైన నిర్ణయాల ప్రకటన తనతో చెప్పకుండా ప్రకటించవద్దు అన్న జగన్

విధానపరమైన నిర్ణయాలు ఏమీ తనకు చెప్పకుండా ప్రకటించొద్దని జగన్ పేర్కొన్నారు. ఎందుకంటేరాష్ట్రం అసలే లోటు బడ్జెట్ లో ఉన్న కారణంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆచి తూచి తీసుకోవాల్సిన అవసరం వుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పరంగా లాభనష్టాలను అంచనా వేయకుండా, వాటిపై అధ్యయనం చేయకుండా మంత్రులు ఎవరూ ప్రకటనలు చేయొద్దని తేల్చి చెప్పారు. తన దృష్టికి రాకుండా విషయాల్ని మంత్రులు ప్రకటనలు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

యువ మంత్రుల దూకుడు కళ్ళెం వేసేందుకే సీఎం జగన్ లక్ష్మణ రేఖ

యువ మంత్రుల దూకుడు కళ్ళెం వేసేందుకే సీఎం జగన్ లక్ష్మణ రేఖ

ఇక అంతిమంగా తాను కోరుకున్న లక్ష్యం దిశగా ప్రభుత్వం సాగాలన్న విషయాన్ని జగన్ తాజా లేఖలో మంత్రులకు స్పష్టం చేశారు . జగన్ ఈ లేఖ రాయటానికి కారణాలు లేకపోలేదు. జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న మంత్రులు తాము కూడా సీఎం తరహాలో దూకుడు చూపించాలని పాలనలో తమ తమ శాఖల్లో మార్క్ ఉండాలని తాపత్రయపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఏవైనా విధానపరమైన నిర్ణయాలు ప్రకటించి ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త చర్యగా వారి దూకుడికి కళ్ళెం వేసేందుకే ఆయన ఈ లేఖ రాశారు. అయితే కేబినెట్ భేటీ జరిగి పది రోజుల వ్యవధిలోనే ఈ తరహా లేఖ రాయటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

English summary
AP CM YS Jaganmohan Reddy recently wrote a letter to his ministers regarding the decisions taken by the new ministers in their respective ministries in AP, saying that they should not announce any policy decisions without telling him. He said that because of the state's deficit in the budget, the decision should be taken in any decision. Jagan said to The ministers no one should make any statements without assessing the benefits of the government and studying them. He concluded that ministers would have to face difficulties if they were to announce matters without their attention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X