• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బార్ అండ్ రెస్టారెంట్ గా మారనున్న జనసేన ఆఫీసు..! గుంటూరులో చోటు చేసుకోబోతున్న ఘటన..!!

|

అమ్మో..! రాజకీయాల్లోనే కాదు రాజకీయ కార్యాలయాల్లో కూడా ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. జనసేన పార్టీ కి సంబందించిన కార్యాయలంలో కూడా ఇలాంటి మార్పులే చోటుచేసుకున్నాయి. ఎన్నికల ఎన్నికల సందర్బంగా ఊరి జనాలు, నాయకులు, కార్యకర్తలు, ఆశావహులతో కలకలలాడిన పార్టీ కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఎన్నికలప్పుడు ప్రధాన కార్యాలయంలో రద్దీని నియంత్రించేందుకు నగరాల్లో అక్కడక్కడ కార్యక్తలకు, నాయకులకు అందుబాటులో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ కార్యాలయాల్లో పార్టీ సంబందించిన చర్చలు, నేతల చేరికలు, రాజకీయ వ్యూహాలు, ఎన్నికల సామాగ్రి, వాహనాల పార్కింగ్, దూరప్రాంతం నుంచి వచ్చిన పార్టీ అభిమానులకు ఆశ్రయం కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

పార్టీ కార్యాలయాలు.. ఎన్నికల ముందు ఒక లెక్క..! ఎన్నికల తర్వాత ఒక లెక్క..!!

పార్టీ కార్యాలయాలు.. ఎన్నికల ముందు ఒక లెక్క..! ఎన్నికల తర్వాత ఒక లెక్క..!!

ఎన్నికల ఫలితాలను బట్టి ఈ కార్యాలయాల కొనసాగింపు ఉంటుందా ఉండదా అనే అంశం ఆధార పడి ఉంటుంది. కొన్ని పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఇలాంటి కార్యాలయాలను సాద్యమైనంత వరకూ ఆర్థిక బారం కాకుండా వుండే విధంగా జాగ్రత్త పడుతుంటారు. కొన్ని పార్టీలు ఏది ఏమైనా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇలాంటి కార్యాలయాలు ఉండాలని అలాగే కొనసాగిస్తుంటారు. కాని ఇటీవల జనసేన పార్టీ గుంటూరులో నెలకొల్పిన పార్టీ కార్యలయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ కోసం తీసుకున్న కార్యలయంలో ఎన్నికల ముందు కార్యక్రమాలే జరిగినా తర్వాత జనసేనకు సంబందించిన నేతలు ఎవ్వరూ కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ కార్యాలయం నడపడం కష్టమే..! వ్యయంతో కూడుకున్న పని..!!

పార్టీ కార్యాలయం నడపడం కష్టమే..! వ్యయంతో కూడుకున్న పని..!!

దీంతో జనసేన పార్టీ కి ఆ కార్యాలయాన్ని కొనసాగించడం భారంగా మారినట్టు తెలుస్తోంది. ఎంతగా ప్రయత్నించినా ఏ ఒక్క కార్యకర్త కూడా అటువైపు కన్నత్తి కూడా చూడటం లేదని పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. పైగా ఎన్నికల్లో ఓటమి తరువాత ఏదో పవన్ తన ఆత్మ సంతృప్తి కోసం అప్పుడప్పుడు అరకొరగా మిగిలిన నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా అది మంగళగిరి కార్యాలయానికి పరిమితం చేసారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఆ పార్టీ కార్యాలయంలో బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై పార్టీ శ్రేణులకు ఓ సమాచారం కూడా అందినట్టు తెలుస్తోంది.

పార్టీ లకు నిధుల కొరత..! పార్టీ కార్యాలయాలను అద్దెలకు ఇస్తున్న యజమానులు..!!

పార్టీ లకు నిధుల కొరత..! పార్టీ కార్యాలయాలను అద్దెలకు ఇస్తున్న యజమానులు..!!

గుంటూరు నగర శివారులో ఉన్న గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కార్యాలయం ఉంది. కానీ, ఇప్పుడది ఖాళీగా ఉంది. ఎన్నికల్లో ఓటమి తరువాత ఈ భవనాన్ని జనసేన నేతలు యజమానికి తిరిగి అప్పగించడంతో, అక్కడ టూలెట్ బోర్డు పెట్టారు. అయితే, అంతకుముందు జనసేన కోసం పెట్టుకున్న లోగోలు, పార్టీ అధినేత చిత్రాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. ఈ భవనాన్ని బార్ అండ్ రెస్టారెంట్ కు అద్దెకిస్తామని యజమాని చెబుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

జనేసన కార్యాయంలో బార్ ఆండ్ రెస్టారెంట్..! గుంటూరులో అరుదైన ఘటన..!!

జనేసన కార్యాయంలో బార్ ఆండ్ రెస్టారెంట్..! గుంటూరులో అరుదైన ఘటన..!!

ఈ సంవత్సరం మార్చిలో ఎన్నికలకు ముందు ఈ భవంతిలో జనసేన తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఎన్నికలకు ముందు రావెల కిషోర్‌ బాబు తెలుగుదేశం పార్టీని వీడి, జనసేనలో చేరిన తరువాత, ఆయనే ఈ భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రారంభించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరాజయం తరువాత, రావెల ఈ ఛాయలకు కూడా రాలేదు. ఆయన బీజేపీలో చేరిపోయారు కూడా. దీంతో కార్యాలయం అతీగతీ పట్టించుకునే వారు లేకపోయారు. కాగా, గుంటూరుతో పాటు పలు పట్టణాలు, నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు మరికొన్ని ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
It seems to have become a burden to continue the office of the Janasana party. After the defeat of the election, some of the Pawan's self-satisfaction was occasionally limited to the rest of the leaders and activists, but it was restricted to Mangalagiri office. The latest campaign is going to be a bar and restaurant in the party office in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X