గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు దూరం పెట్టారు: కోడెల మరణంపై తెలంగాణ అసెంబ్లీ అవరణలో వైసీపీ ఎమ్మెల్యే, కేటీఆర్‌తో భేటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, ఆయన తెలంగాణ మంత్రి కేటీ రామారావుతో కూడా భేటీ అయినట్లు సమాచారం.

రెండు రాష్ట్రాలకు మేలు..

రెండు రాష్ట్రాలకు మేలు..

అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా రాంభూపాల్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. రెండు రాస్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకునేవారనని అన్నారు. గోదావరి, కృష్ణా అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కోడెల ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది?: ఆత్మహత్యేనంటూ పోస్టుమార్టం రిపోర్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు..కోడెల ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది?: ఆత్మహత్యేనంటూ పోస్టుమార్టం రిపోర్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు..

కేసీఆర్‌ను కొడుతున్నారా?

కేసీఆర్‌ను కొడుతున్నారా?

రాష్ట్రం విడిపోయాక రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని వాపోయారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాపీ కొడుతున్నారనడం సరికాదని అన్నారు. తన తండ్రి వైఎస్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ సుపరిపాలన అందించేందుకు శ్రమిస్తున్నారని చెప్పారు.

బాబు దూరం పెట్టడం వల్లే..

బాబు దూరం పెట్టడం వల్లే..

ఇక ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై స్పందిస్తూ.. కోడెల మరణానికి టీడీపీ కారణమని ఆరోపించారు. గత కొద్ది రోజుల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కోడెలను దూరం పెట్టారని అన్నారు. టీడీపీ కార్యక్రమాలకు కోడెలను పిలవలేదని అన్నారు.

తప్పు చేస్తే చర్యలు తప్పవు..

తప్పు చేస్తే చర్యలు తప్పవు..

కోడెలపై ఏపీ సర్కారు తప్పుడు కేసులు పెట్టారనడం సరికాదని వ్యాఖ్యానించారు. కొంత మంది టీడీపీ కార్యకర్తలు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ఎవరు తప్పు చేసినా శిక్షపడుతుందని స్పష్టం చేశారు.

English summary
YSRCP MLA Katasani Rambhupal Reddy on Tuesday appeared at Telangana assembly promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X