గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

kaza toll plaza incident : సీసీటీవీ ఫుటేజ్ విడుదల- అడ్డంగా దొరికిపోయిన రేవతి

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా కాజా టోల్‌ ప్లాజా వద్ద నిన్న చోటు చేసుకున్న ఘటనలో ఏపీ వడ్డెర కార్పోరేషన్‌ ఛైర్‌పర్సన్ దేవళ్ల రేవతి వాదన అంతా ఒట్టిదేనని తేలిపోయింది. టోల్‌ ప్లాజా సిబ్బంది తనను అడ్డుకుని దాడి చేయడం వల్లే తాను ప్రతిదాడికి దిగాల్సి వచ్చిందని, మామూళ్ల కక్కుర్తితోనే వారు ఇదంతా చేశారని రేవతి ఆరోపించిన 24 గంటల్లోపే టోల్‌ ప్లాజాకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ బయటికొచ్చింది.

కాజా టోల్‌ప్జాజాకు సంబంధించి ఇవాళ బయటికొచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఏపీ వడ్డెర కార్పోరేషన్‌ ఛైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి టోల్‌ ప్లాజా సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు స్పష్టమవుతోంది. టోల్‌ కట్టకుండా తన కారును వెళ్లనీయలేదనే ఆక్రోశంతో వారు పెట్టిన బ్యారికేడ్లను పదే పదే తొలగిస్తూ సిబ్బందిపై భౌతిక దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించాయి. దీంతో టోల్‌ ప్లాజా సిబ్బందిపై రేవతి చేసిన ఆరోపణలు ఒట్టివేనని తేలిపోయాయి.

kaza toll plaza : cctv footage shows vaddera corporation chairperson revathis nuisance

అనారోగ్యంతో ఉన్న తన తల్లిని విజయవాడ ఆస్పత్రికి కారులో తరలిస్తుండగా.. టోల్‌ ప్లాజా సిబ్బంది అడ్డుకున్నారని, స్ధానిక పాస్‌ ఉందని చెప్పినా వదిలిపెట్టలేదని, తనను, కారు డ్రైవర్‌ను కులం పేరుతో దూషిస్తూ దాడికి దిగారని రేవతి నిన్న ఆరోపించారు. టోల్‌ ప్లాజా సిబ్బంది దురుసుగా వ్యవహరించినట్లు రేవతి చేసిన ఆరోపణలకు ఇవాళ విడుదలైన సీసీటీవీ ఫుటేజ్‌లో ఎక్కడా ఆధారం కనిపించలేదు. పైగా రేవతి, ఆమె కారు డ్రైవర్‌ పదే పదే బ్యారికేడ్లను తొలగిస్తూ టోల్‌ ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. వాస్తవానికి సీసీటీవీ ఫుటేజ్‌ విడుదల చేస్తే అన్ని విషయాలు బయటికొస్తాయని ఆమె నిన్న డిమాండ్‌ చేశారు. కానీ ఇవాళ విడుదలైన సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తే అలాంటి దృశ్యాలు కనిపించకపోగా రేవతి దురుసు ప్రవర్తనే బయటపడింది. దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

English summary
controversial guntur district kaza toll plaza cctv footage released today. in this footage ap vaddera corporation chairperson devalla revathi caught red handed quarrelling with staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X