గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడెలకు కన్నీటి వీడ్కోలు.. జనసంద్రమైన నరసారావుపేట... గద్గత స్వరంతో స్థానికుల రోదన....

|
Google Oneindia TeluguNews

అమరావతి/ నరసారావుపేట : కోడెల శివప్రసాద్ మృతితో నరసారావుపేట మూగబోయింది. అక్కడి స్థానికులకు నోట మాట రావడం లేదు. తమ కోసం అహోరాత్రులు శ్రమించిన ఠీవీ విశ్రమించిందని తెలిసి .. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కోడెల హఠాన్మరణ వార్త విన్నప్పటి నుంచి ప్రతీ ఒక్కరు తీవ్ర వేదనతో ఉన్నారు. ఇక నరసారావుపేటకు కోడెల పార్థీవదేహం రావడంతో వారంతా దు:ఖసాగరంలో మునిగిపోయారు. తమ అభిమాన నేత నిర్జీవంగా చూసి గద్గత స్వరంతో రోదిస్తున్నారు. అంతిమయాత్రలో పాల్గొని తమ నేతకు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు.

ఇసుకవేస్తే రాలనంత జనం ..

ఇసుకవేస్తే రాలనంత జనం ..

కోడెల శివప్రసాద్ ఇంటి నుంచి అంతిమయాత్ర కొనసాగుతోంది. గత రెండు గంటల నుంచి అంతిమయాత్ర కంటిన్యూ అవుతుంది. అంతిమయాత్రకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. కోడల అంతిమయాత్ర జనసంద్రాన్ని తలపించింది. తమ నియోజకవర్గానికి చేసిన మేలును గుర్తుచేసుకుంటున్నారు. తమకు ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చేవారని గుర్తుచేస్తున్నారు. కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించి .. తమ అభివృద్ధికి దోహదపడ్డారని పేర్కొంటున్నారు. ఇంతచేసిన కోడెల తమ మధ్య లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఆయన ఆకాల మరణం నరసారావుపేటకు తీరని లోటని కీరిస్తున్నారు.

బాగోగులు పట్టించుకునే వారు ..

బాగోగులు పట్టించుకునే వారు ..

కోడెల అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు అంతిమయాత్ర వాహనంలో బాలకృష్ణ ఆశీనులయ్యారు. టీడీపీ శ్రేణులు, నరసారావుపేట నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇన్నాళ్లు తమతో ఉన్న నేత లేకపోవడం తమను కలచివేస్తోందని గుర్తుచేసుకుంటున్నారు. దాదాపు 25 ఏళ్లు నరసారావుపేట ఎమ్మెల్యేగా పనిచేసి .. తమ బాగోగులను పట్టించుకున్నారని మననం చేసుకుంటున్నారు.

విచిత్రగాధ..

విచిత్రగాధ..

కోడెల ఆత్మహత్య నుంచి అంత్యక్రియల వరకు కొన్ని విచిత్రాలు జరిగాయి. కోడెల శివప్రసాద్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాక .. వెంటనే ఆయనను బసవతారకం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. బసవతారకం ఆస్పత్రి చైర్మన్‌గా కోడెల పనిచేశారు. ఆస్పత్రికి మంచి పేరు తీసుకొచ్చేందుకు అహార్నిసలు శ్రమించారు. చివరికీ అక్కడికీ నిర్జీవంగా వెళ్లిపోయారు. కట్ చేస్తే నరసారావుపేటలో శ్మశాన వాటికను నిర్మించారు కోడెల శివప్రసాద్. ఇప్పుడు అందులోనే కోడెల అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. తాను పుట్టిన గడ్డ మీద .. కట్టింటిచన శ్మశానంలోనే కోడెల శివప్రసాద్ ఛితభస్మం అవుతున్నారు.

English summary
Kodela Sivaprasad funeral continue in narasaraopet. kodela worked for them long time in Narasaraoopeta. Their favorite leader looks dead and grieves with a loud voice
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X