గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడెలపై 23 కేసులు...! ప్రభుత్వ కక్ష తోనే ఆయన ఆత్మహత్య : యనమల

|
Google Oneindia TeluguNews

వైసిపీ ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు చర్యలతోనే కోడెల చనిపోయారని ఎమ్మెల్సీ యనమల రామక్రిష్ణుడు ఆరోపించారు. కోడెలతొ ఆయన కుటుంభంపై మొత్తం 23 కేసులు పెట్టారని ఆయన తెలిపారు. కేసులన్ని చిన్న చిన్న కేసులని, తదనంతరం ఆయనపై కక్ష సాధింపు చేపట్టారని అన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య గల కారణాలు ఏమిటనే అంశంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయనన డిమాండ్ చేశారు.

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై రాజకీయాలు చుట్టుముడుతున్నాయి. ఆయన మరణం వెనక ఎలాంటీ పరిస్థితులు ఉన్నాయనేది ఇంకా తేలకముందే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్దం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఆయన పై ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ నేత యనమల రామక్రిష్ణుడు తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Kodela have died due to political faction of the YCP government

ఆయనకు తెలిసినంత వరకు ఎలాంటీ ఆర్ధిక కోణాలు గాని, కుటుంభ తగాదాలు కాని లేవని చెప్పారు..అయితే కోడెల కుటుంభంపై మొత్తం 23 కేసులు ఉన్నాయని కేసులతోపాటు ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు పార్టీ పూర్తిస్తాయిలో అండగా ఉన్నప్పటికి ఆయన మనోధైర్యం కోల్పోయారని అన్నారు. ఇలా టీడీపీలో ప్రతి ఒక్కరిని చిత్రహింసలకు గురి చేయాడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.

English summary
Kodela had died due to The political faction of the YCP government MLC Yanamala Ramakrishnan alleged.A total of 23 cases have been filed against his family he said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X