గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పల్నాటి పులి కోడెల, భయం అంటే ఏంటో తెలియదు, మృతిని జీర్ణించుకోలేమన్న చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసి మన్ననలు పొందారు. ఏపీ తొలి స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు. టీడీపీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.

కోడెల శివప్రసాద్‌కు భయం అంటే ఏంటో తెలియదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పులిలా బతికారని .. ఫైర్ బ్రాండ్ అని చెప్పారు. కోడెల శివప్రసాద్ మృతితో గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. కోడెల శివప్రసాద్ మృతిని జీర్ణించుకోలేక పోనిదని చంద్రబాబు అన్నారు. అతని ఆత్మహత్య గురించి తలచుకుంటేనే బాధ కలుగుతుంది. విరోచితంగా పోరాడాడు .. కానీ మానసిక, శారీరక వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ పల్నాడు పులి అని పేర్కొన్నారు.

kodela is tiger.. he never fear says chandrababu naidu

టీడీపీ కోసం రేయింబవళ్లు శ్రమించారు. సంక్షోభాలకు ఎదుర్కొన్న కోడెల .. అవమానాన్ని మాత్రం భరించలేకపోయాడని పేర్కొన్నారు చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు మంచిది కాదన్నారు చంద్రబాబు. సీనియర్ నేత మృతి తమను తీవ్రంగా కలచివేస్తోందని తెలిపారు. ఓ వైద్యుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నామని చెప్పారు. ఒక డాక్టర్ మానసిక క్షోభకు గురై, అవమానానికి గురై తప్ప ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని తెలిపారు. కోడెల మృతికి కారణమెవరో తెలుసుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు.

English summary
TDP chief Chandrababu did not know what fear of Kodela Sivaprasad. babu paid tribute in Guntur with the death of Kodela Sivaprasad. could not digest Sivaprasad dead news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X