గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగిసిన కోడెల రాజకీయ ప్రస్థానం ... ఆరుసార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా , స్పీకర్ గా ...

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హయాం నుండి పార్టీకి విశేష సేవలందించిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పలు అవమానాలు ఎదుర్కొన్న కోడెల బసవతారకం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. పల్నాటి పులి గా పేరు తెచ్చుకున్న కోడెల శివప్రసాదరావు రాజకీయ ప్రస్థానంలో తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు.

కోడెల జీవితం విషాదాంతం: కుమారుడితో వాగ్వాదమే కారణమంటూ : అవమానాలు భరించలేక..!!కోడెల జీవితం విషాదాంతం: కుమారుడితో వాగ్వాదమే కారణమంటూ : అవమానాలు భరించలేక..!!

 నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు

నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు

నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే కాక , విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కోడెల శివప్రసాదరావు కీలక పాత్ర పోషించారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించిన ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మొదట వైద్యుడిగా సేవలందించిన కోడెల శివప్రసాదరావు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ పిలుపు మేరకు టిడిపిలో చేరారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో నాటి నుండి నేటి వరకు తనదైన ముద్ర వేసిన కోడెల శివప్రసాదరావు ఆరు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Recommended Video

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య
ఐదు సార్లు వరుసగా నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ .. మంత్రిగానూ సేవలు

ఐదు సార్లు వరుసగా నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ .. మంత్రిగానూ సేవలు

2014 లో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. 1983, 1985, 1989, 1994,1999 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు నర్సరావుపేట అసెంబ్లీ స్థానం నుండివిజయం సాధించారు. అంతేకాదు రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో కోడెల శివప్రసారావు మంత్రిగా పనిచేశారు. 1996-97 లలో భారీ మధ్యతరహా, నీటిపారుదల శాఖా మంత్రిగా, 197-99 మధ్యలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రిగా కోడెలపనిచేశారు. 2014-19 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు. స్పీకర్ గా పనిచేసిన సమయంలో వైసిపి నేతల నుండి పలు విమర్శలు ఎదుర్కొన్నారు.

 గత ఎన్నికల్లో అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలైన కోడెల .. ముగిసిన కోడెల రాజకీయ ప్రస్థానం

గత ఎన్నికల్లో అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలైన కోడెల .. ముగిసిన కోడెల రాజకీయ ప్రస్థానం


2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు.ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్ పై వైసిపి వర్గీయులు దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుండి ఆయన వరుస అవమానాలను చవిచూశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుండి ఆయన కుటుంబంపై పలు కేసులు నమోదు అయ్యాయి . ఈ నేపధ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నారు. పల్నాటి పులిగా కార్యకర్తలతో పిలిపించుకున్న కోడెల శివప్రసాదరావు నేడు తన రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు, తన జీవన ప్రస్థానాన్ని ఆత్మహత్యకు పాల్పడి ముగించారు.

English summary
Senior leader and former speaker, Kodela Sivaprasad Rao commits suicide. Kodela who has faced many humiliations since the YSR Congress came to power, breathed his last at the basavatarakam hospital. Known as the Palanti Tiger, Kodela Sivaprasadarao has emerged as an undisputed leader in the political arena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X