గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడెల తన జీవితాంతం క్రమశిక్షణతో మెలిగాడు : చంద్రబాబు నాయుడు

|
Google Oneindia TeluguNews

మాజీ స్పీకర్, కోడెల శివప్రసాదరావు తన జీవితాంతం క్రమశిక్షణతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇలాంటీ నేపథ్యంలోనే అయన్ను అందరు పల్నాటి పులిగా పిలిచేవారని అన్నారు. ఆయనకు భయమంటే ఏమిటో తెలియదని చెప్పారు. అలాంటీ వ్యక్తి చనిపోయిన విధానాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలోనే పలు కేసులతో కోడెలను వేధించారని అన్నారు. ముఖ్యంగా లక్ష రుపాయల ఫర్నిచర్ కోసం ఆయన కక్కుర్తి పడ్డారని వేధింపులకు గురి చేశారని అన్నారు. వేల కోట్ల రుపాయాల ఆరోపణలు ఉన్న సీఎం జగన్‌‌మోహన్‌రెడ్డి నీతులు చెప్పడం విడ్డురంగా ఉందని అన్నారు. ప్రభుత్వ అధికారాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక కోడెలపై కేసులు పెట్టినప్పుడు తాను ఎంతో సముదాయించానని చెప్పారు. చలో పల్నాడుకు కూడ కోడెల వస్తానని చెప్పారని... అయితే తానే వద్దని చెప్పానని అన్నారు.

Kodela Shivaprasad Rao has been disciplined for whole his life : Chandrababu Naidu

నరసరావుపేటలో కోడెల సంస్మరణ సభను నిర్వహించారు. సభకు చంద్రబాబు నాయుడతో పాటు పలువురు టీడీపీ నేతలు సభకు హజరయ్యారు. ఈ సంధర్భంగా కొడెలతో ఉన్న అనుబంధాన్ని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. కోడెల వైద్య వృత్తితోపాటు, రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నరసరావుపేట తోపాటు గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. అలాంటీ వ్యక్తిని ప్రభుత్వమే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించిందని పుల్లారావు విమర్శలు చేశారు.

English summary
Former Speaker Kodela Shivaprasad Rao has been disciplined for whole his life, TDP chief Chandrababu Naidu recalled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X