• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కోడెల ఆత్మహత్య కేసుల వల్ల కాదు.. చంద్రబాబు దూరం పెట్టడం వల్లే... ఏపీ మంత్రి కొడాలి నాని సంచలనం

|

అమరావతి : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ది రాజకీయ హత్య అని ఆరోపించారు ఏపీ మంత్రి కొడాలి నాని. తనను నమ్ముకొన్న పార్టీ, అధినేత దూరం పెట్టడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కోడెల శివప్రసాద్‌ను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని 3 నెలలో ఎందుకు చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పలేదని ప్రశ్నించారు. కోడెల, అతని కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీపై కేసు పెట్టింది బాధితులేనని స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ కేసులు నమోదు చేయలేదని తేల్చిచెప్పారు.

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ అదేశం..!!

 నమ్మినవారే

నమ్మినవారే

తనను నమ్ముకొన్న పార్టీ, అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరకు రానీయడం లేదని.. ఆ అవమాన భారంతోనే కోడెల శివప్రసాద్ బలవన్మరణానికి పాల్పడ్డారని మంత్రి కొడాలి నాని తెలిపారు. నమ్మిన పార్టీ, కుటుంబం పెద్ద లాంటి అధినేత దూరం పెడితే ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేక .. ఈ లోకంలో ఉండలేక ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారన్నారు. ఓ నేతగా వెన్నంటే ఉంటే మీరిచ్చిన గౌరవం అదీ అని చంద్రబాబును ప్రశ్నించారు నాని. గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా.. నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ... అనర్హత వేటు వేయకుండా స్పీకర్ స్థానానికి కోడెల శివప్రసాద్ న్యాయం చేయలేకపోయారని చెప్పారు.

ఎప్పుడూ మోసం, వంచనే

ఎప్పుడూ మోసం, వంచనే

అప్పుడే కాదు ఎప్పుడు మీ వెన్నంటే ఉన్న కోడెలను మీరు దారుణంగా అవమానించారని తెలిపారు. పార్టీలో కొందరి చేత కోడెల శివప్రసాద్ తప్పుచేశారని మాట్లాడించారని ఆరోపించారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులతో పార్టీ కార్యాలయంలో మాట్లాడించి .. కోడెలను ఒంటరి చేసింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు కొడాలి నాని. అంతేకాదు శాసనసభ ఫర్నీచర్‌కు సంబంధించి ఏ చర్య తీసుకున్నా తాము కాదనబోమని ఓ పత్రికలో చంద్రబాబు పేరుతో వచ్చిన వార్తను చదివి వినిపించారు కొడాలి నాని. కోడెల శివప్రసాద్‌ను చంద్రబాబు దారుణంగా అవమానించారు. అందుకోసమే ఆయన అవమాన భారాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు.

అవమానాలు

అవమానాలు

గతంలో కూడా కోడెల శివప్రసాద్‌ను చంద్రబాబు నాయుడు అవమానించారని గుర్తుచేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. 1999లో కోడెల ఇంట్లో బాంబు పేలిందని విచారణ చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. తర్వాత కోడెల కన్నా జూనియర్ అయిన ఆళ్లపాటికి మంత్రి పదవీ ఇవ్వలేదా ? అని నిలదీశారు. పుట్టి పెరిగిన నరసరావుపేటను కాదని సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేసింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు.

మంత్రి పదవీ కాదని ..

మంత్రి పదవీ కాదని ..

2014లో ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి పదవీ ఇవ్వాలని కోడెల కోరితే .. స్పీకర్ పదవీ కట్టబెట్టింది మీరు కాదా అని కొశ్చన్ చేశారు. స్పీకర్ చేత చేయించాల్సిన పనులన్నీ చేయించలేదా అని నిలదీశారు. 2019లో సత్తెనపల్లి నుంచి ఓడిపోయాక .. అక్కడ ఇంచార్జీ తీసింది మీరు కాదా .. నియోజకవర్గానిక వెళితే చాలు మీ శ్రేణులతో ఆందోళన చేయించలేదా అని కొడాలి చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Speaker Kodela Sivaprasad accused AP politician Kodali Nani. The party, which trusted him, said he had committed suicide by insulting the chief chandra babu. Asked why Chandrababu had not spoken to the media in the past 3 months, the AP government had embarrassed Kodela Sivaprasad. Kodela, his son Sivaramakrishna and daughter Vijayalakshmi have made it clear that they are the victims. The AP government and the CM pics concluded that no cases were registered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more