గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి: పడిపోయిన ప్రభలు, ప్రమాదాల్లో ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

3 Minutes 10 Headlines | Namaste Trump | IND vs NZ 1st Test Day 2 | Oneindia Telugu

గుంటూరు: జిల్లాలోని ప్రసిద్ధ కోటప్పకొండ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న క్రమంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో వారి బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

గుంతలోపడిపోయిన ప్రభ వాహనం..

గుంతలోపడిపోయిన ప్రభ వాహనం..


శుక్రవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండల పరిధిలో కోటప్పకొండకు తరలివస్తున్న విద్యుత్ ప్రభ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయింది. నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్‌పాలెం గ్రామస్థులు ప్రభతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభ ఉన్న వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి గుంతలో పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఉత్సవాలకు వెళ్తుండగానే..

ఉత్సవాలకు వెళ్తుండగానే..

ఈ ప్రమాదంలో చిలకలూరిపేట మండలం మురికిపూడికి చెందిన కార్మికుడు మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్సవాలకు వెళ్తుండగా ప్రమాదాలు జరగడంతో ఉత్సవాలను రద్దు చేసుకుంటున్నట్లు అమీన్ సాహెబ్ ప్రభ కమిటీ ప్రకటించింది. ఈ రెండు ప్రమాదాల కారణంగా స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

మరో ప్రమాదంలో ఇద్దరు...

మరో ప్రమాదంలో ఇద్దరు...

ఇది ఇలావుండగా, ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం వద్ద కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న ఎడ్లబండిని లారీ ఢీకొంది. పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడుకు చెందిన రైతులు ఎడ్లబండ్లపై ప్రభను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన లారీ ఎడ్లబండిని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.

జాతీయ రహదారిపై ఆందోళన.. రాకపోకలకు అంతరాయం

జాతీయ రహదారిపై ఆందోళన.. రాకపోకలకు అంతరాయం

ఘటనా స్థలంలోనే నిమ్మగడ్డ కోటేశ్వరరావు మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా శివాజీ అనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో వీరితోపాటు మరో నలుగురు కూడా గాయాలపాలయ్యారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, మృతి చెందిన రైతుల బంధువులు జాతీయ రహదారిపై ఆందోళనలకు దిగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

English summary
Kotappakonda Shivaratri celebrations: 3 killed in two accidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X