గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారి చూపిన గురువునకు వందనం ... తీర్చుకోలేనిది మాస్టారూ... మీ రుణం

|
Google Oneindia TeluguNews

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
.. చక్షురున్మీలితం యేనా తస్మై శ్రీ గురవే నమః
అజ్ఞానం అనే చీకట్లను తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వారు గురువులు. అటువంటి గురువులకు నేను సర్వదా కృతజ్ఞతతో ఉంటాను. ఇది ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో, గురువు పాత్ర అంతకుమించి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేసేది, వారు ఎంచుకున్న రంగంలో వారి ప్రయాణం సాగేలా చేసేది గురువులే. స్ఫూర్తి ప్రదాతలు గురువులు .

Teachers day 2020 : గురువే దైవం ... టీచర్స్ డే గొప్పతనం, సెప్టెంబర్ 5 నే జరుపుకునే కారణం ఇదే Teachers day 2020 : గురువే దైవం ... టీచర్స్ డే గొప్పతనం, సెప్టెంబర్ 5 నే జరుపుకునే కారణం ఇదే

 ఓ గొప్ప ఉపాధ్యాయుడిని స్మరించుకునే అవకాశం

ఓ గొప్ప ఉపాధ్యాయుడిని స్మరించుకునే అవకాశం

వయసు మీద పడుతున్నా సరే చిన్ననాడు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను అందరూ గుర్తు చేసుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాగా ఇష్టమైన, వారిని ప్రభావితం చేసిన, స్ఫూర్తి నింపిన, వారి మనసులపై బలమైన ముద్ర వేసిన గురువులు ఉంటారు. అలాంటి గురువులను స్మరించుకునేందుకు టీచర్స్ డే ఒక పర్వదినం. ఈరోజు చాలా మంది విద్యార్థుల జీవితాల్లో స్ఫూర్తి నింపిన , గ్రామాలకు గ్రామాలే గొప్పవారిగా కీర్తించిన నిబద్దత కలిగిన ఓ మాస్టారి గురించి తెలుసుకుందాం.

నూతక్కి గ్రామంలో నిబద్ధత ,అంకితభావంతో పని చేసిన మాస్టారి జీవితం

నూతక్కి గ్రామంలో నిబద్ధత ,అంకితభావంతో పని చేసిన మాస్టారి జీవితం

గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు నూతక్కి. ఆ గ్రామంలో కృష్ణా మాస్టారు అంటే తెలియనివారుండరు. ఆయన జీవితమంతా విద్యా బోధనకే అంకితం చేసిన గొప్ప గురువు. ఎప్పుడు పిల్లలు, పాఠాలు, వారి ఉన్నతి తప్ప మరి ఏ ధ్యాస లేని ఒక గొప్ప ఉపాధ్యాయుడు కృష్ణా మాస్టారు. గాయత్రీ విద్యా నికేతన్ పేరుతో పాఠశాలను నడిపించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో, వారి భవితకు బంగారు బాటలు వెయ్యటంలో ఆయన పోషించిన పాత్ర ఎనలేనిది. ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో, పేరు ప్రఖ్యాతులు పొందారు అంటే అది ఆయన గొప్పతనం అనే చెప్పాలి .

కృష్ణా మాస్టారి లోకం ఎప్పుడూ విద్యార్థులే ... మాస్టారి ఇల్లే ఒక పాఠశాల

కృష్ణా మాస్టారి లోకం ఎప్పుడూ విద్యార్థులే ... మాస్టారి ఇల్లే ఒక పాఠశాల

వృత్తి పట్ల ఆయన నిబద్ధతకు ఎన్నో ఉదాహరణలు . అప్పట్లో ఏడోతరగతి పబ్లిక్ పరీక్ష .. ఏడో తరగతి వరకు స్కూల్ నడిపిన మాస్టారు ఉదయం నుండి సాయంత్రం దాకా స్కూల్ లో పిల్లల మధ్యే ఉండేవారు. సాయంత్రం కూడా ట్యూషన్లు పెట్టి చదివించేవారు . రాత్రి వేళల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులు ఇళ్ళకు వెళ్ళలేని పరిస్థితి ఉండేది . విద్యార్థులను అక్కడే తన ఇంట్లో తనతో పాటే పడుకోబెట్టి తిరిగి తెల్లవారు జామునే ట్యూషన్ నిర్వహించేవారు. సొంత బిడ్డల్లా చూశారు. కంటికి రెప్పలా కాపాడారు. ఆయన జీవితం అంతా విద్యార్థుల చదువుకే అంకితం చేశారు . మాస్టారు విద్యార్థులు మధ్యలో మంచం వేసుకుని పడుకున్న రోజులు, పిల్లల చదువు కోసం ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తాయి. ఆయన నేర్పించిన సంస్కార, సౌజన్యాలు చాలామందిని గొప్పవారిగా మలిచాయి.

15, 20 గ్రామాల్లో మాష్టారంటే తెలియని వారుండరు

15, 20 గ్రామాల్లో మాష్టారంటే తెలియని వారుండరు

ఇప్పటికీ గ్రామంలో ఎవరిని కృష్ణ మాస్టారు గురించి అడిగినా చాలా గొప్పగా చెబుతారు. ఒక్క నూతక్కి గ్రామం లోనే కాదు, చిర్రావూరు, మెల్లెంపూడి , రామచంద్రపాలెం , వీర్లపాలెం ఇలా చుట్టుపక్కల పదిహేను,ఇరవై ఊర్లలో ఆయన పేరు తెలియని వారుండరు.

పిల్లలకు అర్థమయ్యే రీతిలో చదువు చెప్పడమే కాదు, గ్రామాలలో ప్రజల కష్టాలు అర్థం చేసుకుని వారికి తోడ్పాటు అందించడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. ఎవరైనా నిరుపేద విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉంటే, చూసి చూడనట్టు వదిలేసే స్వభావం కృష్ణా మాస్టర్ ది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించటం ధ్యేయంగా, వారి ఇల్లే ఒక పాఠశాల గా నడిచింది అంటే మాస్టారి గొప్పతనం ఎంతో అర్థమవుతుంది.

 మాస్టార్ తో పాటు ఆయన సతీమణి బుజ్జి టీచర్ .. స్కూల్ కే వారి జీవితం అంకితం

మాస్టార్ తో పాటు ఆయన సతీమణి బుజ్జి టీచర్ .. స్కూల్ కే వారి జీవితం అంకితం

గ్రామాలలో చాలామంది తల్లిదండ్రులకు విద్యార్థుల చదువు పై పట్టింపు ఉండేది కాదు. అంతా కృష్ణా మాస్టారు చూసుకుంటారు అన్న ఒక ధైర్యం తో తమ పిల్లలను స్కూల్ కు పంపించేవారు.


విద్యలో వెనుకబడిన విద్యార్థులను సైతం ప్రత్యేకంగా ట్యూషన్లు పెట్టి వారు చదువులో రాణించేలా చేసేవారు. కృష్ణా మాస్టారు మాత్రమే కాదు, ఆయన సతీమణి బుజ్జి టీచర్ కూడా తన జీవితాన్ని పాఠశాలకే అంకితం చేశారు. పగలు,రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ పిల్లలతోనే ఉంటూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఈ ఉపాధ్యాయ దంపతులు ఎంతో కష్టపడ్డారు. నిరాడంబర జీవితం గడిపారు . ధనార్జనే ధ్యేయం అన్నట్టుగా కాకుండా గ్రామాల్లో వారికి విద్యాబుద్ధులు నేర్పటమే లక్ష్యంగా స్కూల్ నడిపారు .

Recommended Video

#Coronavirusindia : భారత్ లో రికార్డు స్థాయి లో నమోదు అవుతున్న Corona కేసులు | #IndiaFightsCorona
నిస్వార్ధంగా సేవ చేసిన , విద్యాబుద్ధులు నేర్పిన గురువుల జ్ఞాపకాలు మదిలో పదిలం

నిస్వార్ధంగా సేవ చేసిన , విద్యాబుద్ధులు నేర్పిన గురువుల జ్ఞాపకాలు మదిలో పదిలం

కృష్ణా మాస్టారు బ్రతికినంత కాలం ఉపాధ్యాయ వృత్తినే కొనసాగించారు. ఆయన మరణం దాదాపు 20 గ్రామాలను శోకసముద్రంలో ముంచింది. ఇసుకేస్తే రాలనంత మంది జనం మాస్టారు కోసం వచ్చి కన్నీరు కార్చారు అంటే ఆ మహనీయుడు ఎందరి జీవితంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించారో అర్ధం చేసుకోవచ్చు. మాస్టార్ వద్ద చదువుకున్న చాలా మంది విద్యార్థులు నేటికీ ఆ మహనీయుని స్మరించుకుంటున్నారు అంటే అది ఆయన గొప్పతనం.


మాస్టారు భౌతికంగా లేకున్నా ఆయన వెలిగించిన విద్యా జ్యోతులు దేశ, విదేశాల్లో వెలుగుతూనే ఉన్నాయి. నిస్వార్ధంగా సేవ చేసిన మాస్టారు అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు .

English summary
Krishna Master a well known teacher in nuthakki village guntur district. He was a great teacher who devoted his entire life to teaching. His role in running the school under the name of Gayatri Vidya Niketan and in shaping the students into responsible citizens and paving golden paths for their future . The students who studied near krishna master have gained a reputation at the highest level in the country and abroad, which means that it is his greatness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X