గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భయపెట్టాలనే అచ్చెన్న అరెస్ట్ .. ఓటమి భయంతో పిరికిపందలా జగన్ చర్య : లోకేష్ తో పాటు టీడీపీ నేతలు ఫైర్

|
Google Oneindia TeluguNews

పంచాయతీ ఎన్నికల సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ టీడీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టిడిపి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్నాయుడు అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు గా నారా లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో భయభ్రాంతులకు గురి చెయ్యటానికే ఈ చర్యలకు దిగుతున్నారన్నారు .

కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

 ఓటమి భయంతో జగన్ రెడ్డి పిరికిపంద చర్యలు : లోకేష్ ఫైర్

ఓటమి భయంతో జగన్ రెడ్డి పిరికిపంద చర్యలు : లోకేష్ ఫైర్

పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదని భయంతోనే జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని నారా లోకేష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు ఇంటి పైకి రాడ్లు, కత్తులతో దాడి కి వెళ్ళిన వైసిపి నేత దువ్వాడ శ్రీనివాస్ పై , అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేయలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని, ప్రజలు వైసీపీకి బుద్ధి చెబుతారని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. నియంత జగన్ రెడ్డి కి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అని పేర్కొన్న లోకేష్ టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు.

 వైసీపీ ఓటమి భయంతోనే అక్రమాలకు పాల్పడుతోంది : బోండా ఉమ

వైసీపీ ఓటమి భయంతోనే అక్రమాలకు పాల్పడుతోంది : బోండా ఉమ


నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఓటమి భయంతోనే అక్రమాలకు పాల్పడుతున్నట్టు నిప్పులు చెరిగారు. టిడిపి నాయకులు బయట ఉంటే వైసిపి ఆటలు సాగవని అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ చేసి టీడీపీ బలపరిచిన అభ్యర్థులు భయపెట్టాలని ఉద్దేశంతోనే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని బోండా ఉమా నిప్పులు చెరిగారు.

 ఏ తప్పు చేశాడని అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేశారో డిజిపి చెప్పాలని డిమాండ్

ఏ తప్పు చేశాడని అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేశారో డిజిపి చెప్పాలని డిమాండ్


అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్న బోండా ఉమ, పోలీసులు చట్టాన్ని, రూల్ ఆఫ్ లా నీ గాలికి వదిలేశారని, కోర్టులు చివాట్లు పెడుతున్నా కూడా లెక్క చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేశాడని అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేశారో డిజిపి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవాలని, ఇది ప్రతిపక్షాలను భయపెట్టడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యగా వ్యాఖ్యానించారు బోండా ఉమ.

 అక్రమ అరెస్టులకు తగిన మూల్యం చెల్లించుకోవాలి : నక్కా ఆనంద్ బాబు

అక్రమ అరెస్టులకు తగిన మూల్యం చెల్లించుకోవాలి : నక్కా ఆనంద్ బాబు


టిడిపి పేరు వింటేనే జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని, జగన్ దుర్మార్గపు పాలన ఇది నిదర్శనమని అచ్చెన్నాయుడు అరెస్ట్ పై మండిపడ్డారు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఖండించిన ఆయన జగన్ దుర్మార్గపు పాలన కు ఇదే నిదర్శనమన్నారు. అక్రమ అరెస్టులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుని అరెస్ట్ చేసి, ఎన్నికలలో టిడిపి బలపరిచిన అభ్యర్థులు భయపెట్టాలన్న లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం ఈ తరహా చర్యలకు దిగుతోందని టిడిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు .అచ్చెన్న అరెస్టుపై మండిపడుతున్నారు.

English summary
TDP leaders are furious over Atchannaidu's arrest. TDP national general secretary Nara Lokesh said the Atchannaidu arrest was the culmination of Rajareddy's constitution. Nara Lokesh condemned the arrest of Atchannaidu in Nimmada. TDP leaders are deeply impatient. They are resorting to these measures to intimidate during the elections and threatening the candidates who are contesting in panchayat elections with the support of tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X