గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ నీ బతుకు ఫేక్ .. సింహాచలం అప్పన్న సన్నిధికి రా .. తేల్చుకుందాం : లోకేష్ సవాల్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డిని ఏ వన్ క్రిమినల్ అంటూ సంబోధించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దొంగ ఆరోపణలు చేస్తున్నారంటూ సింహాచలం అప్పన్న ఆలయంలో సత్య ప్రమాణానికి సవాల్ చేశారు నారా లోకేష్.

ప్రొద్దుటూరులో లోకేష్ , చంద్రబాబు పరామర్శ : హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబానికి భరోసా ప్రొద్దుటూరులో లోకేష్ , చంద్రబాబు పరామర్శ : హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబానికి భరోసా

జగన్ ను టార్గెట్ చేసి లోకేష్ సవాల్

జగన్ ను టార్గెట్ చేసి లోకేష్ సవాల్

ఏపీలో ఆలయాల్లో సత్య ప్రమాణాల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన ఈ ట్రెండ్, విశాఖకు, అలాగే కడప జిల్లా వరకూ పాకింది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డినే సింహాచల అప్పన్న వద్ద సత్య ప్రమాణం చేయాలని చాలెంజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ ని టార్గెట్ చేసిన లోకేష్ ట్విట్టర్ లో తన సవాల్ పోస్ట్ చేశారు .

 ఏ వన్ క్రిమినల్ సీఎం .. నీ పాలన ఫేక్ .. అప్పన్న సన్నిధికి రా .. తేల్చుకుందాం

ఏ వన్ క్రిమినల్ సీఎం .. నీ పాలన ఫేక్ .. అప్పన్న సన్నిధికి రా .. తేల్చుకుందాం

ఏ వన్ క్రిమినల్ సీఎం, తన డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ 2 దొంగ రెడ్డి తో దొంగ ఆరోపణలు చేస్తున్నారు. నీ బతుకు ఫేక్, నీ పార్టీ ఫేక్, నీ హామీలు ఫేక్, నీ పాలన ఫేక్ అంటూ జగన్ రెడ్డి పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు లోకేష్. చివరికి నా పై నీ దొంగల బ్యాచ్ తో చేయించే ఆరోపణలు ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలింది. ఎన్నాళ్ళీ దొంగ ఆరోపణలు జగన్ రెడ్డి ? సింహాచల అప్పన్న సన్నిధికి నువ్వేరా.. తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. నువ్వు నాపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ..నువ్వు సిద్ధమా? అంటూ నారా లోకేష్ సీఎం జగన్ కు చాలెంజ్ చేశారు.

 రాముడి విగ్రహ ధ్వంసం ఘటన వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందని వైసీపీ ఎంపీ ఆరోపణలు

రాముడి విగ్రహ ధ్వంసం ఘటన వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందని వైసీపీ ఎంపీ ఆరోపణలు

తాజాగా విజయసాయిరెడ్డి రామతీర్థం లో కోదండరామ స్వామి విగ్రహం ధ్వంసం ఘటన టిడిపి ప్రమేయంతోనే జరిగిందని, చంద్రబాబు, లోకేష్ ల కనుసన్నల్లోనే జరిగిందని, కోదండరామస్వామి ఆలయంలో విగ్రహం ధ్వంసం చేయడంలో చంద్రబాబు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఆధారాలతో సహా టిడిపి నేతలు దొరికారు అని కూడా వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే తీవ్రంగా ఆగ్రహానికి గురైన నారా లోకేష్ సత్య ప్రమాణానికి రమ్మని సీఎం జగన్ కు చాలెంజ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

 నేడు రామతీర్ధం కు చంద్రబాబు , వైసీపీ ఎంపీ కూడా ... సర్వత్రా ఉత్కంఠ

నేడు రామతీర్ధం కు చంద్రబాబు , వైసీపీ ఎంపీ కూడా ... సర్వత్రా ఉత్కంఠ

మరోపక్క టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం ఆలయాలపై దాడులను తీవ్రంగా ఖండించారు . రామతీర్ధంలో ఘటనా స్థలాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు .ఈ నేపథ్యంలో ఈరోజు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు పలువురు వైసిపి శాసనసభ్యులు పార్టీ శ్రేణులు రాబోతున్నారు. దీంతో ఇటు చంద్రబాబు పర్యటన, మరోవైపు వైసీపీ నేతల పర్యటన నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది.

English summary
TDP national general secretary Nara Lokesh made sensational remarks against AP CM YS Jagan. Jagan addressed as A1 criminal". Nara Lokesh has challenged the oath of allegiance at the Simhachalam Appanna temple alleging that CM Jagan Mohan Reddy is making lie allegations. Chandrababu Naidu will visit the scene in Ramatirtham today. In this context, many YCP legislators along with YCP MP Vijayasaireddy are coming to Ramateertham. With this, there was a suspense about what was going on in the wake of Chandrababu's visit and YCP leaders' visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X