andhra pradesh election results 2019 lok sabha election results 2019 mangalagiri lokesh rk ministry ఆర్కే వైసీపీ
లోకేశ్ పరాజయం : ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖాయం: 5200 ఓట్ల మెజార్టీ
రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారు. రాజధాని ప్రాంతం ఎక్కువగా ఉన్న మంగళగిరిలో లోకేశ్ పేరు ప్రకటించిన సమయం నుండి ఆయన గెలుపు మీద అనేక రకాల చర్చలు సాగాయి. వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరునే జగన్ ఖరారు చేసారు. ఆర్కేను తిరిగి గెలిపిస్తే మంత్రిని చేస్తానని మంగళగిరి ప్రచార సభలో జగన్ ప్రకటించారు. ఇక, ఇప్పుడు మంగళగిరిలో లోకేశ్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓడించారు. దీంతో..ఇప్పుడు ఆళ్లకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ ఫలితాల వేళ ట్విస్ట్.. కోడి కత్తి శీనుకు బెయిల్
5200 ఓట్ల మెజార్టీతో ఆర్కే గెలుపు..
గుంటూరు జిల్లా మంగళగిరి ఫలితం అధికారికంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి తనయుడు..మంత్రి లోకేశ్ టీడీపీ అభ్యర్దిగా ఇక్కడ నుండి పోటీ చేసారు. ఎన్నికల ప్రచారంలో లోకేశ్‌కు మద్దతుగా ఆయన సతీమణి బ్రాహ్మణి సైతం ప్రచారం చేసారు. పోలింగ్ రోజు నాడు టీడీపీ..వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అదే రోజు సాయంత్రం లోకేశ్ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి భైఠాయించి ఆందోళన వ్యక్తం చేసారు. పోలింగ్ ముగిసిన తరువాత తన గెలుపు ఖాయమని ఆర్కే చెబుతూ వచ్చారు. అదే సమయంలో రెండు వందల కోట్లు లోకేశ్ గెలుపు కోసం ఖర్చు చేసారని ఆరోపించారు. లోకేశ్ మాత్రం పార్టీ విజయం గురించి..తన గెలుపు గురించి ఎక్కడా మాట్లాడ లేదు. అయితే, తాజాగా ఫలితాలు సైతం ఇద్దరి మధ్యా దోబుచూలాడింది. చివరకు 5200 ఓట్ల అధిక్యతంతో వైసీపీ అభ్యర్ది ఆర్కే తన సమీప అభ్యర్ది లోకేశ్ పైన విజయం సాధించారు.

తీర్పును గౌరవిస్తాను..
మంగళగిరి ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ఫలితాల తరువాత లోకేశ్ ట్వీట్ చేసారు. తాను మంగళగిరి ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేసారు. మొత్తం ఏపీలో కేబినెట్ మంత్రుల్లో కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. లోకేశ్ ఓటమి పార్టీకి..ప్రత్యేకంగా ముక్యమంత్రి ఊహించని ఫలితంగా చెప్పకోవచ్చు. ఇప్పుడు లోకేశ్ ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.