గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు:వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి: లోకేశ్ ఫైర్..!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి లోకేశ్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదని.. వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చి పెట్టడానికి గొయ్యి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేసారు. ఆధారాలు బయటపెట్టమని అడిగితే జగన్ కాకి లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గత ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతి పైన ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందులో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పైన కీలక సిఫార్సులు చేసింది. అధ్యయనం చేసిన తరువాత దీనిని సీబీఐ లేదా లోకాయుక్త కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహా తీసుకొని ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది.

ఎన్నార్సీపై ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది: మడమతిప్పే నాయకుడు కదా: లోకేశ్ సెటైర్..!ఎన్నార్సీపై ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది: మడమతిప్పే నాయకుడు కదా: లోకేశ్ సెటైర్..!

దీని పైన మాజీ మంత్రి లోకేశ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేసారు. 4,075 ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతి ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు 1170 ఎకరాలు. మరి 4,075 ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో. భ్రమల్లో బతుకుతున్న వైసీపీ నాయకులు, ఉపసంఘం మేధావులు చెప్పాలి. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు మేం సిద్ధం..అంటూ ట్వీట్ లో స్పష్టం చేసారు. అదే సమయంలో గత 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు సిద్ధమా.. అని ప్రశ్నించారు.

Lokesh serious comments on CM jagan and his govt

మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికలో ఈ నెలలోనే జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజున ఆర్దిక మంత్రి బుగ్గన సభలో అమరావతిలో ఇన్ సైడర్ కు పాల్పడిన వారి పేర్లను వెల్లడించారు. చంద్రబాబు..లోకేశ్ సన్నిహితులు అందులో ఉన్నారని ఆరోపించారు. అదే విధంగా పలువురు మాజీ మంత్రులు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసారని చెప్పుకొచ్చారు. ఇక, ఈ వ్యవహారం పైన హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. ఇప్పుడు ప్రభుత్వం సైతం ఆ వ్యవహారం పైన విచారణ దిశగా అడుగులు వేస్తోంది.

English summary
Ex minister Lokesh serious comments on CM jagan and his govt. Lokesh says that TDP is ready for investigation on insider trading Allegations which made by YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X